ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టారు. సీఎం గా వైఎస్ జగన్ మానిఫెస్టో ను తూచా తప్పకుండా అమలు చేయటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేయటం ద్వారా సంక్షేమ ప్రభుత్వఫు ప్రాధామ్యాలు స్పష్టమయ్యాయి.
ఇదీ చదవండి : అన్ స్టాపబుల్’ బాలయ్యతో.. ‘తగ్గేదే లే’ అంటున్న పుష్ప టీమ్!
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘పేదలందరికీ ఇళ్లు ’పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.35వేల అదనపు రుణం తీసుకునేందుకు వీలు కల్పిస్తూ కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ రుణానికి 3 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం.
మొత్తం 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి గానూ ఈ రూ.35 వేల అదనపు రుణాన్ని తీసుకునేందుకు అనుమతిస్తూ గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కు ఎప్పుడు రుణ పడి ఉంటామని చెబుతున్నారు లబ్ది దారులు.
