దివంగత మహానేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బొమ్మతో వందరూపాయల వెండి నాణెం విడుదలైంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆయన బొమ్మతో కేంద్రం వందరూపాయల నాణేన్ని విడుదల చేయడం విశేషం.
దివంగత మహానేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి జరుపుకుంటున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. ఎన్‌టీఆర్ చిత్రంతో ముద్రించిన వందరూపాయల వెండి నాణాన్ని ఆర్బీఐ నేడు విడుదల చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నాణాలను 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం చొప్పున జింకు, నికెల్ కలిపి తయారు చేశారు. వీటిని ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సినీ, రాజకీయ రంగాలలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసిన శకపురుషుడు ఎన్‌టీఆర్. ఈ పేరు ఒక్క తెలుగు ప్రజలకే కాదు.. దేశ వ్యాప్తంగా అందరికీ సుపరిచితమే. ఎన్‌టీఆర్ అన్న మూడక్షరాలు.. తెలుగుజాతి ఔన్నత్యానికీ, తెలుగు వాడి ఆత్మగౌరవానికీ ప్రతీకలుగా ఎప్పటికీ చరిత్రలో నిలిచి ఉంటాయి. సినీ, రాజకీయ రంగాలలో తనకు తానే సాటి. పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహా నటుడు ఎన్‌టీఆర్. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి.. ఇలా ఏ పాత్ర అయినా తలకాయ ప్రవేశం చేసేవారు. ఇక ఆయన రాజకీయ ప్రస్థానానికి వస్తే.. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29న తెలుగు దేశం జెండాను ఎగరవేసి, పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలు తిరక్కుండానే అధికారంలోకి వచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే.. దైవానికి ప్రతి రూపమే ఎన్‌టీఆర్ అని తెలుగు ప్రజల చెప్తుంటారు.
ఇంతటి గణనీయ చరిత్ర ఉన్న మహనీయకుడి నాణాన్ని ప్రతి ఒక్కరు సొంతం చేసుకోవాలనికోరుకోవడం సహజం. ఎన్‌టీఆర్ చిత్రంతో ఉన్న నాణెం కొనుగోలుకు, రిజర్వు బ్యాంకు కౌంటర్ లేదా ఏదైనా బ్యాంకులో రూ.4,160 చెల్లించాల్సి ఉంటుంది. ఇంత మొత్తం చెల్లించక నాణాన్ని మీకు అందిస్తారు. ఎన్‌టీఆర్ చిత్రంతో నాణెం విడుదల చేయాలని ఆయన కుమార్తె పురందేశ్వరి గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విన్నవించిన సంగతి తెలిసిందే. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో మార్గం సుగమైంది. కాగా, గతంలో కూడా పలువురు ప్రముఖుల చిత్రాలతో ఆర్బీఐ ఈ తరహా నాణాలు విడుదల చేసింది. ఇటీవలి కాలంలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి చిత్రంతో నాణెం విడుదల చేసింది.
NTR figure on Rs.100 coin: రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ#NTR𓃵 #100rscoin #currency #100Rs #coin #NTR #Hashtag #ntrcoin #TDPTwitter pic.twitter.com/mzoYXZu4hN
— RAMSAI NALABOTU (@tweetfor_ram) February 27, 2023