ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా బీజేపీ అధినాయకత్వం పార్టీలో సంస్థాగతంగా కీలక మార్పులు చేస్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ వైసీపీ నేత, బీజేపీ నేత పురంధరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆలయంలో పూజలు చేస్తున్న సమయంలో కళ్లు తిరిగినట్లు అనిపించి కుటుంబ సభ్యులకు తెలిపారు.
దివంగత మహానేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బొమ్మతో వందరూపాయల వెండి నాణెం విడుదలైంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆయన బొమ్మతో కేంద్రం వందరూపాయల నాణేన్ని విడుదల చేయడం విశేషం.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుపై బీజీపీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. ట్విటర్ వేదికగా జీవీఎల్‌కు చివాట్లు పెట్టారు. ఎన్టీఆర్, వైఎస్సార్‌ల గురించి చెబుతూ జీవీఎల్‌కు కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కెతున్నాయి. ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నా.. అధికార, విపక్షాల మధ్య మాత్రం మాటల యుద్ధం జరుగుతోంది. సందర్భం దొరికిన ప్రతి సారి విపక్ష నేతలు.. ప్రభుత్వ నేతలపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. పురంధేశ్వరిపై ఘాటు విమర్శలు చేశారు. గుడివాడలో అభివృద్ధిని అడ్డుకుంటే.. తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అన్న ఎన్టీఆర్ రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దని […]
రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అయినా సరే.. వేర్వేరు పార్టీల్లో ఉంటే ప్రత్యర్థులు అనే అంటారు. ఇక వారి మధ్య చోటు చేసుకునే సంభాషణలు, సంఘటనలు ఆసక్తికరంగా మారతాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఆయన పెద్దమ్మ, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు.. ఓ న్యూస్ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్న జిల్లాకు ‘ఎన్టీఆర్ జిల్లా’గా నామకరణం చేయడంపై టీడీపీ నేతలు, నందమూరి వారసులు ఇప్పటి వరకు ఎవరూ స్పందించకపోవడంపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. పార్టీ అధినేత నుంచి కార్యకర్తల వరకు ఈ విషయంలో సైలెంట్ గా ఉండటం ఏంటని రక రకాలుగా చర్చించుకుంటున్నారు. కాకపోతే ఎన్టీఆర్ తనయ, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి మాత్రం స్పందించారు. ‘‘ఆ మహనీయుడు […]