ఏపీ కేబినెట్ లో పలు మార్పులు చేర్పులు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే 24 మంది మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించారు. గురువారం ప్రారంభం అయిన కేబినెట్ మీటింగ్ కి ఖాళీ లెటర్ హెడ్‌లతో వెళ్లిన మంత్రులు కేబినెట్ భేటీలోనే వాటిపైనే తమ రాజీనామాలను చేశారు. మంత్రులు ఇచ్చిన లేఖలను తర్వాత సీఎం జగన్ గవర్నర్ కి సమర్పించనున్నట్లు సమాచారం.
రాజీనామా అనంతరం సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ తన కేబినేట్ లో ఎవరిని తీసుకోవాలన్నది ఆయన నిర్ణయం. ఈ విషయంలో జగన్ నిర్ణయమే ఫైనల్ అని కూడా బొత్స స్పష్టం చేశారు. విషయంలో జగన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి విజయం చేకూర్చడమే తమ లక్ష్యమని చెప్పారు.
మంత్రి పదవులు ముఖ్యం కాదు.. ప్రజా శ్రేయస్సు ముఖ్యమని.. పదవి ఉన్నా.. లేకున్నా ప్రజల వెంట ఉండేవారే సరైన నాయకులు అని అన్నారు. పార్టీలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో సీఎం జగన్‌కు తెలుసు అన్నారు. తాము ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశామని అన్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.