ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రి పేర్ని నానికి అదనంగా మరో శాఖను అప్పగించింది. ప్రస్తుతం ఉన్న సమాచార, రవాణా శాఖలకు అదనంగా సినిమాటోగ్రఫీ శాఖను కూడా పేర్ని నానికి అప్పగించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ కింద ఆదేశాలిచ్చారు. బిజినెస్ రూల్స్ లోని ఆర్టికల్ 166, క్లాజ్ (3), రూల్ 6, సబ్ రూల్ (1) కింద ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
సినిమా టికెట్ల విషయంలో జీవో హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ విషంపై ప్రభుత్వం అప్పీలుకు కూడా వెళ్లిన. ఇలాంటి సందర్భంలో జగన్ సర్కారు సినిమాటోగ్రఫీ మంత్రిగా పేర్ని నాని నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.