రాజధాని నగరం హైదరాబాద్‌పై ఒక నిశ్శబ్ద మహమ్మారి పడగ విప్పుతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత 7 నెలల డేటాను పరిశీలిస్తే బయటపడిన నిజాలు వెన్నులో వణుకు పుట్టించేలా చేస్తున్నాయి. నగరంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో నమోదైన క్యాన్సర్ కేసుల సంఖ్య ఏకంగా 35 వేలకు చేరుకుంది. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ ప్రాణాంతక వ్యాధిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఏయే క్యాన్సర్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి? […]