హైదరాబాద్ శివారు మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఒక వివాహిత అత్యంత దారుణంగా హత్యకు గురైంది. జిల్లెలగూడ దత్తునగర్లోని ఒక అపార్ట్మెంట్లో ఈ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తల్లిని రక్తపు మడుగులో చూసి షాక్కు గురయ్యారు. హైదరాబాద్లోని మీర్పేట్ పరిధిలో గల జిల్లెలగూడ దత్తునగర్లో విషాదకర ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న శ్రీ […]