‘అనిల్ అంబానీ..’ కొద్దికాలం కిందటి వరకు అందరకీ ఆయనే స్ఫూర్తి. కానీ, నేడు ఆయనలా అవ్వకూడదనే వారందరకీ ప్రత్యక్ష ఉదాహరణ. ఇతనే ఎవరో కాదు.. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ స్వయానా సోదరుడు. ముఖేష్ అంబానీ అంతకంతకూ ఆస్తులను పెంచుకుంటూ దూసుకెళ్తుంటే.. అనిల్ అంబానీ మాత్రం అప్పుల కోసం ఉన్న ఆస్తులను సైతం ఆస్తులను అమ్ముకుంటున్నారు. ఈయన దెబ్బకు ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ సైతం భారీ మెుత్తంలో సొమ్మును కోల్పోనుంది. రిలయన్స్ క్యాపిటల్(RCAP), ఎల్ఐసీకి రూ.3,400 […]
పన్నుల ఎగవేత, స్విస్ బ్యాంకు ఖాతాలలో ఉన్న నిధుల వివరాలు వెల్లడించకపోవడం వంటి ఆరోపణలపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ సోదరుడు రిలయన్స్ గ్రూప్(అడాగ్) ఛైర్మన్ అనిల్ అంబానీని ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదాయ పన్నుశాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. స్విస్ బ్యాంకులోని రెండు ఖాతాల్లో రహస్యంగా దాచిన రూ.814 కోట్ల నిధులపైనా, రూ.420 కోట్లు పన్నులను ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేశారని ఆదాయపు పన్ను శాఖ ఆరోపిచింది. అనిల్ అంబానీ ఉద్దేశ పూర్వకంగానే విదేశీ బ్యాంకు అకౌంట్ వివరాలను […]