నవంబర్ నెలలో చలి తీవ్రత పెరుగుతుందనుకుంటున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు భారత వాతావరణ శాఖ ఒక కీలక అలర్ట్ జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో మొదలైన ఒక వాతావరణ కదలిక.. రాబోయే 48 గంటల్లో బలమైన వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ అల్పపీడనం ఎప్పుడు ఏర్పడుతుంది? దీని గమనం ఎటువైపు ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్‌లోని ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.. అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం గురువారం విడుదల […]
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 13 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం నవంబర్ 15 నాటికి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నవంబర్ 16, 17 తేదీల్లో […]
ఎండల తాకిడితో, వర్షాభావ పరిస్థితులతో విలవిల్లాడుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలకమైన అప్‌డేట్ అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో ఇవాల్టి నుంచి రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కేవలం సాధారణ వర్షాలే కాకుండా అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులు కూడా తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అసలు ఏ ఏ జిల్లాల్లో వాతావరణం ఎలా […]
ఏపీలో వాతావరణం మళ్లీ మారబోతుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పలకరించనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురిసే వీలుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర, దాని […]