విశాఖ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు కార్మికులు భయపెడుతున్నాయి. తాజాగా మరోసారి జరిగిన ప్రమాదంతో అక్కడ భయాందోళనకర వాతావరణం నెలకొంది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్-1 సీసీడీ విభాగంలో సాంకేతిక లోపం తలెత్తడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాడిల్ స్లెడ్ గేట్ సరిగ్గా మూతపడకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తుంది. ల్యాడిల్ గేట్ తెరుచుకుని ఉండటంతో దానిలో ఉన్న అధిక ఉష్ణోగ్రత కలిగిన ఉక్కుద్రవం కింద ఒలికి నేలపాలైంది. తీవ్రమైన వేడితో కూడిన ఉక్కుద్రవం […]