వరల్డ్ వైడ్ పాపులర్ అయిన హాలీవుడ్ ఫిల్మ్ సిరీస్ ‘జాన్ విక్’ ఫ్రాంచైజ్ నుండి తాజాగా ‘చాప్టర్ 4’ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈసారి జాన్ విక్ సాగా(JW4) నాల్గవ భాగం.. మరింత గ్రాండ్ గా 2 గంటల 49 నిమిషాల నిడివితో సినిమాటిక్ ఎక్సపీరియెన్స్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అయిపోయారు. జాన్ విక్ నుండి ఇదివరకు రిలీజైన మూడు భాగాల కన్నా నాలుగో భాగం.. ఆడియెన్స్ అటెన్షన్ సంపాదించుకుందని చెప్పాలి. ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన చాప్టర్ 4.. మార్చి 24న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి జాన్ విక్ ఫ్రాంచైజ్ నుండి వచ్చిన ఈ నాలుగో చాప్టర్ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం!
మొదటి భాగంలో జాన్ విక్(కీను రీవ్స్).. అతని భార్య చనిపోయే ముందు బహుమతిగా ఇచ్చిన పెట్ డాగ్ ‘బీగల్ డైసీ’ని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం గురించి జరుగుతుంది. కానీ.. ఇప్పుడు జాన్ విక్ 4కి వచ్చేసరికి.. పగ, ప్రతీకారాలు కాస్త ఖండాలు దాటి ఒక ఎపిక్ స్టోరీగా డెవలప్ చేశారు. ఈసారి చాప్టర్ 4లో ఇంటరెస్టింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ట్విస్టులు, క్యారెక్టర్స్ కూడా ఉండటం విశేషం. జాన్ విక్ 4లో హీరో బ్యాక్ స్టోరీ గురించి చర్చించలేదు. కానీ.. తుపాకీ పోరులో పాలక సంస్థ అయిన ‘ది హై టేబుల్’ నుండి ఫ్రీడమ్(స్వేచ్ఛ)ను రాబట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? స్వేచ్ఛ కోసం చేసే పోరాటంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు? అనేది ఇప్పుడీ చాప్టర్ 4 కథ.
జాన్ విక్ స్వేచ్ఛ కోసం మొదలుపెట్టిన చాప్టర్ 4లో.. కొత్త క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. జాన్ విక్ ప్రపంచంలో ఎలాంటి కఠినమైన రూల్స్ ఉంటాయో ఇదివరకే చూసుంటారు. జాన్ విక్ కి ఎన్ని పవర్స్ ఉన్నాయో.. అతని చుట్టూ ఎన్నో కఠినమైన రూల్స్ ఎప్పటికప్పుడు అడ్డు పడుతుంటాయి. ఇందులో జాన్ లైఫ్ చాలాసార్లు టెస్ట్ చేయబడుతుంది. పాత ఫ్రెండ్స్ కూడా శత్రువులుగా మారతారు. ఇలాంటి టైమ్ లో ఫ్రెండ్ షిప్ అనేది ఎంతవరకు పని చేస్తుంది? రక్తపాతం చేయక తప్పదా? అనే సందేహాలు కలిగిస్తూ.. సినిమాని ఇంటరెస్టింగ్ గా నడిపించారు. అయితే.. తన వరల్డ్ లో జరుగుతున్న గొడవలు, రక్తపాతానికి దూరంగా ఉండాలని ట్రై చేసినా.. అతని వద్ద వేరే ఆప్షన్స్ లేక రక్తపాతం సృష్టించే విధంగా జాన్ విక్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు.
ఈసారి జాన్ విక్ 4ని విజువల్స్ తో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు టైలర్ బేట్స్, జోయెల్ జె రిచర్డ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయని చెప్పాలి. అయితే.. సినిమాని షూట్ చేసిన ప్రదేశాలు, కెమెరా వర్క్ మాత్రం చాలా అందంగా ఉన్నాయి. చాప్టర్ 4 రిలీజ్ ముందే అంచనాలు పెంచుతూ.. కొత్త క్యారెక్టర్స్ తో నియో-నోయిర్ సినిమాటిక్ ప్రపంచాన్ని చూపిస్తాయని అర్థమైంది. అకిరా (సవయమా) తన తండ్రి కోజి (సనద) హత్య కారణంగా ఈ ప్రపంచంలో అడుగుపెడుతుంది. ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ వలన ట్రాకర్ మిస్టర్ నోబడీ(అండర్సన్)గా.. జాన్ విక్ పాత ఫ్రెండ్ కైన్ (యెన్) క్యారెక్టర్స్ ఎంట్రీ.. కథలో ఆసక్తిని రేకెత్తిస్తాయి.
ఈ చాప్టర్ 4లో మార్షల్ ఆర్ట్స్ కి, గన్ ని జతచేసారు. తన కుక్కకు హాని కలిగించిన వారికి జాన్ విక్ ఇప్పటికీ.. బుల్లెట్లను పార్సల్ చేసి పంపించడం.. వెనుక రివెంజ్ ప్లాన్ ఉందని చెప్పే ట్విస్ట్ బాగుంది. చాప్టర్ 3లో జాన్ విక్.. అత్యద్భుతమైన పోరాటాల తర్వాత.. ఇప్పుడు ‘ది హై టేబుల్’ యుద్ధంలో పాల్గొనడమే మేజర్ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్. చాప్టర్ 3లో విన్ స్టన్ తో.. జాన్ టేబుల్ ఒప్పందానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ ఫ్రెండ్ షిప్ కి ప్రాధాన్యత ఇవ్వడమే.. జాన్ విక్ జీవితంలో విషాదాన్ని నింపింది. మరి ది హై టేబుల్ నుండి జాన్ ఎలా ఫ్రీడమ్ పొందాడు అనేది.. చాప్టర్ 4 సారాంశం. మరి ఈసారి చాప్టర్ 4లో ఇదివరకు చూడని సాహసాలు, రక్తపాతం సృష్టించారు మేకర్స్. యాక్షన్ లవర్స్ కి ఈ జాన్ విక్ 4 ఫుల్ మీల్స్ అనే చెప్పాలి.