కొన్ని దేశాల్లో పిల్లలకి ఆడుతూ, పాడుతూ విద్యని నేర్పిస్తారు. పిల్లలు కూడా ఆ మంచి వాతావరణంలో బాగా చదువుకుంటూ ఉంటారు. అక్కడ పిలల్లపై ఎలాంటి భారం ఉండదు. కానీ.., మన దేశంలో మాత్రం ఇలాంటి వాతావరణం లేదు. ఒకటో తరగతి పిల్లాడికి కూడా 10 కేజీల పుస్తకాలు ఉంటాయి. హోం వర్క్స్ అని, ఎగ్జామ్స్ అని ఇలా పిల్లలపై భారం పెడుతూనే ఉంటారు. ఇక ఉదయం 9 గంటలకి మొదలయ్యే క్లాస్ లు సాయంత్రం 4 వరకు కొనసాగుతూనే ఉంటాయి. వీటికి ప్రైవేట్ క్లాస్ లు అదనం. కానీ.., లాక్ డౌన్ వచ్చి ఇప్పుడు స్కూల్స్ క్లోజ్ అయిపోయాయి. విద్యార్థులు ఆన్లైన్ లోనే తమ విద్యని కొనసాగిస్తున్నారు. కానీ.., ఇక్కడ కూడా విద్యార్థులపై భారం తప్పడం లేదు. రోజు 10 గంటల పాటు ఆన్లైన్ క్లాస్ లు జరుగుతున్నాయి. అంత సేపు ఒకే దగ్గర కూర్చొని, ఒకదాని తరువాత ఒకటిగా క్లాస్ లు వింటూ విద్యార్థులు మెంటల్ గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. కానీ.., తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో పిల్లల బాధ అర్ధం చేసుకోవడం లేదు. దీంతో.., ఓ ఆరేళ్ళ బాలిక మాత్రం తమ కష్టాలని ఏకంగా దేశ ప్రధాని మోదీకి చెప్పుకుంది. చిన్న వాళ్ళమైన మా మీద ఇంత ఒత్తిడి ఎందుకు అంటూ ఏకంగా మోదీని నిలదీసింది.
ఆ వివరాల్లోకి వెళ్తే.., ప్రస్తుతం దేశంలోని అన్నీ రాష్ట్రాలలో ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అయితే, ఈ ఆన్లైన్ క్లాస్ల పట్ల చాలా మంది విద్యార్థులు విసిగిపోతున్నారు. తాజాగా జమ్మూ కశ్మీర్కు చెందిన ఆరేళ్ల బాలిక.. గంటల తరబడి సాగే ఆన్లైన్ క్లాస్ల పట్ల విసిగెత్తిపోయింది. చివరికి ఏం చేయాలా? అని ఆలోచించి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకే ఫిర్యాదు చేసింది. 45 సెకన్ల పాటు తీసిన వీడియోలో ఆ చిచ్చర పిడుగు ఆన్లైన్ క్లాస్ వల్ల తాను పడుతున్న ఇబ్బందులను హావభావాలతో వ్యక్తపరిచించింది. “ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఆన్లైన్ క్లాస్లు మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగాయండి . ఇంకా ‘ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఉర్దూ, ఈవిఎస్, కంప్యూటర్ క్లాస్ లు కూడా ఉన్నాయి. పిల్లలం అయిన మాకు ఇది చాలా పనిభారం పెంచుతుంది. మోదీ సార్.. చిన్న పిల్లలు ఎందుకు ఎక్కువ పని భారాన్ని ఎదుర్కోవాలి? పని భారం తగ్గాలంటే ఏం చేయాలి? నమస్కారం మోదీ సార్.. ఇక ఉంటాను బై” అంటూ వీడియో ముగించేసింది. ఓ జర్నలిస్ట్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. దీంతో.., ఇప్పుడు నెటిజన్స్ ఆ పాపకి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ‘మోదీ జీ.. ఆ పాప మాటలు విన్నారా? మీరు చిన్నారులకి ఆన్లైన్ క్లాసుల కష్టాలు తగ్గించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.