సీసీటీవీలు వచ్చాక ఎన్నో కేసులను ఛేదించడం పోలీసులకు చాలా సులభతరంగా మారింది. కానీ, సీసీటీవీలు ఉన్నాయని తెలిసినా.. పోలీసులు వస్తారని బెరుకు కూడా లేకుండా ఓ దొంగల ముఠా చేసిన బీభత్సం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ ఘటన ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది. బుధవారం ముంబై ములుంద్ ప్రాంతంలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ కు సంబంధించిన ఓ కార్యాలయంలోకి దొంగల ముఠా చొరబడింది. ముగ్గురు దుండగులు మాస్కులు ధరించి కార్యాలయంలోకి ప్రవేశించారు. ఉద్యోగులకు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి.. ఆఫీసులోని కోటి రూపాయల సొమ్ముతో ఉడాయించారు. దొంగల హల్ చల్ మొత్తం అక్కడున్న సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.#WATCH A case has been registered against 3 unidentified miscreants who robbed around Rs 1 crore from an office at ‘gunpoint’ in the Mulund area of Mumbai (02.02)
(Video Source: Mumbai Police) pic.twitter.com/vLoVdvrPcw
— ANI (@ANI) February 2, 2022
