Viral Video: దేశ వ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ రోజు రోజుకు కఠినతరం అవుతున్నాయి. ప్రమాదాలు నివారించటానికి ట్రాఫిక్ అధికారులు ఫైన్ల రూపంలో ప్రజలను కట్టడి చేస్తున్నారు. వారిని సక్రమ మార్గంలో పెట్టే ఆలోచనలు చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి భారీగా ఫైన్లు వేసి ఇకపై తప్పు చేయాలంటే భయపడేలా చేస్తున్నారు. అయితే, ఫైన్లకు కొంతమంది భయపడి రూల్స్‌ను ఇష్టం లేకపోయినా పాటిస్తున్నారు. మరికొంతమంది తమ చావు తెలివి తేటలతో ట్రాఫిక్ రూల్స్‌నుంచి తప్పించుకుంటున్నారు. వీరందరికి భిన్నంగా కొంతమంది అమాయకులు కూడా ఈ సమాజంలో ఉన్నారు. వారి అమాయకత్వాన్ని చూస్తే పగలబడి నవ్వటం ఖాయం.
ఇక, అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచే ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అతడు ఫోర్ వీలర్‌కు హెల్మెట్ పెట్టుకున్నాడు. ఫోర్ వీలర్ అంటే ఏ కారో, లారీనో అనుకునేరు.. అది కూరగాయలు అమ్మే తోపుడు బండి. అవును! మీరు విన్నది నిజమే.. ఆ వ్కక్తి కూరగాయలు అమ్ముకునే వ్యక్తి. హెల్మెట్ వేసుకుని కూరగాయలు అమ్మాడు. అతడ్ని చూసిన జనం ఆశ్చర్యపోయారు. ఎందుకలా హెల్మెట్ పెట్టుకుని కూరగాయలు అమ్ముతున్నాడో అర్థంకాలేదు. కొంతమంది అతడ్ని ఆపి ‘ఎందుకు హెల్మెట్ పెట్టుకున్నావు?’ అని అడిగారు. అందుకు అతను సమాధానం ఇస్తూ..
‘‘హెల్మెట్ వేసుకుంటే పోలీసులు ఆపరని వేసుకుంటున్నాను’’ అన్నాడు. ‘‘ పోలీసులు హెల్మెట్ లేని టూవీలర్ వాళ్లను ఆపుతున్నారని కూడా చెప్పాడు. దీంతో ఆ వ్యక్తులు నీది టూవీలర్ కాదు కదా ఫోర్ వీలర్ కదా అని అన్నారు. అప్పుడు ఆ కూరగాయలు అమ్మే వ్యక్తికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ వెంటనే సదరు వ్యక్తులు ‘‘ చూడు బాబు! నీది కూరగాయల బండి. నువ్వు హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఫోర్ వీలర్‌కు హెల్మెట్ అవసరం లేదు. దానికి సీటు బెల్ట్ ఉండాలి. ఒకరకంగా చెప్పాలంటే నీది ఫోర్ వీలర్ కూడా కాదు’’ అని అన్నారు. దీంతో కూరగాయలు అమ్మే వ్యక్తి హెల్మెట్‌ను తీసి బండిపై పెట్టి, తోసుకుంటూ వెళ్లిపోయాడు.
Bhai apka knowledge to Kamal hai bhai 🤣🤣 pic.twitter.com/twjvQhNe6a
— ShaCasm (@MehdiShadan) October 9, 2022