Viral Video: కేజీఎఫ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో యశ్. సినిమాలో ఆయన నటనకు చాలా మంది ఫ్యాన్స్‌గా మారిపోయారు. కొందరు ఆయనను కలవాలని తపిస్తుంటే.. మరికొందరు ఆయనలా గెటప్ మార్చుకుని.. గడ్డం, జుట్టు పెంచి సంతోష పడిపోతున్నారు. అలా గెటప్ మార్చుకున్న కొంతమంది అచ్చం యశ్‌లాగా కనిపిస్తూ ఉన్నారు. జనం డూప్లికేట్ రాకీ భాయ్‌లను నిజమైన యశ్ అనుకుని పొరపడుతున్నారు. తాజాగా, కొంతమంది యశ్ ఫ్యాన్స్ ఓ డూప్లికేట్‌ను నిజమైన యశ్ అనుకుని పొరపడ్డారు. ఎంతలా అంటే.. ఆ వ్యక్తే నేను యశ్ కాదని చెప్తే కానీ, తెలియలేదు. ఇంతకీ సంగతేంటంటే.. కర్ణాటకకు చెందిన సుబ్రమణ్య ఫణీంద్రకు యశ్ అంటే అభిమానం.
అందుకే, కేజీఎఫ్ సినిమాలో యశ్‌లా గడ్డం, జట్టు పెంచుకున్నాడు. ఇక, అచ్చం రాకీ భాయ్‌లా తయారయ్యాడు. ఊర్లో జనం కూడా అతడ్ని చూసి ‘అరె అచ్చం రాకీ భాయ్‌లా ఉన్నాడే’ అనటం మొదలుపెట్టారు. కొద్దిరోజుల క్రితం ఫణీంద్ర కారులో బయట ఊరుకు వెళ్లాడు. ఓ చోట కొంతమంది జనం కారులో ఉన్న అతడ్ని చూసి రాకీ భాయ్ అనుకున్నారు. కారు ఆపి మరీ దగ్గరకు వచ్చారు. ఓ మహిళ ఫణీంద్ర దగ్గరకు వచ్చి.. ‘‘నేను మీకు పెద్ద ప్యాన్‌ను. సెల్ఫీ తీసుకోవచ్చా’’ అంటూ సెల్ఫీ తీసుకోవటానికి సెల్ ఆపరేట్ చేయసాగింది. ఇంతలో ఫణీంద్ర ‘‘ నేను నిజమైన యశ్‌ను కాదు’’ అని చెప్పాడు.
ఆమె ఆశ్చర్యపోయింది. ‘అయితే ఎవరు మీరు?’ అని అడిగింది. అప్పుడు కారులో ఉన్న ఫణీంద్ర మిత్రులు ‘రాకీ భాయ్ తమ్ముడు’ అని అబద్ధం చెప్పారు. ‘‘మీరు ఇతని సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇతడు యశ్‌కు ఇన్‌ఫామ్ చేస్తాడు’’ అని అన్నారు. ఇక, సదరు మహిళతో పాటు ఓ యువతి, మరో వ్యక్తి ఫణీంద్రతో సెల్ఫీలు తీసుకుని సంతోషపడిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Any Movie Tickets For RS 75: సినీ లవర్స్‌కు శభవార్త: ఏ సినిమా టికెట్ అయినా రూ. 75కే..