పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గాండ్ల వెంకన్న. జగిత్యాల జిల్లాకు చెందిన ఇతడు గత కొన్నిరోజుల నుంచి కనిపించకుండపోయాడు. దీంతో అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు కాకుండా గ్రామంలోని ప్రజలు వెతకడం మొదలు పెట్టారు. గ్రామస్తులు బృందాలుగా విడిపోయి మరీ వెంకన్న కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా వెంకన్న జాడ మాత్రం కానరాలేదు. ఇక లాభం లేదనుకున్న గ్రామస్తులు ఇతని ఆచూకి తెలిపిన వారికి ఏకంగా రూ.3 లక్షలు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు. రూ.3 లక్ష్లలు ఇస్తామని ఆఫర్ వదలడంతో జనాలంతా అతని కోసం గాలిస్తున్నారు. అయితే ఇతను మతిస్థీమితం లేకుండా పోయాడేమో, సమస్యలతో ఇంట్లో నుంచి పారిపోయాడేమోనని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అవును మీరు విన్నది నిజమే. అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
జగిత్యాల జిల్లాలోని గోవిందపల్లి గ్రామం. ఇక్కడే గాండ్ల వెంకన్న అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు చిట్టల వ్యాపారం కూడా మొదలు పెట్టాడు. అయితే వెంకన్న గ్రామంలోని ప్రజలు తన వద్ద చిట్టీలు వేసేలా నమ్మించాడు. దీంతో జనాలంత మన ఊరి మనిషే కదా అని నమ్మి అతని వద్ద చాలా మంది చిట్టీలు వేశారు. ఇలా అందరి వద్ద నుంచి డబ్బును వసూలు అయ్యాక చిట్లీ వ్యాపారీ వెంకన్న డబ్బులను తీసుకుని ఎవరికీ కనిపించకుండపారిపోయాడు. ఉన్నట్టుండి అతడు ఊళ్లో కనిపించకపోవడంతో చిట్టీ వేసిన కొందరు వెంకన్నకు ఫోన్ లు చేశారు. ఎన్నిసార్లు చేసినా స్పందించలేదు.
దీంతో కొన్ని రోజుల వెయిట్ చేశారు. కానీ వెంకన్న మాత్రం ఊళ్లోకి ఇంకా రాలేదు. దీంతో మోసం పోయామని గ్రహించిన చిట్టీ వేసిన వ్యక్తులు లబోదిబో మంటూ మోత్తుకున్నారు. అనంతరం చిట్టీలు వేసిన కొంతమంది అతని జాడ కోసం అంతటా వెతికడం మొదలు పెట్టారు. కానీ.. ఎంత వెతికినా అతడి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక లాభం లేదనుకున్న గ్రామస్తులు ఇతడిని ఇతని ఆచూకి తెలిపిన వారికి రూ.3 లక్షలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఏకంగా రూ.3 లక్ష్లలు ఇస్తామని ఆఫర్ వదలడంతో స్థానిక జనాలంతా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశం ఇప్పడు స్థానికంగా సంచలనంగా మారుతోంది.