సోషల్ మీడియా.. ఇది ఒక మహా సముద్రం అని చెప్పొచ్చు. ఇక్కడ ఎవరు, ఎప్పుడు, ఎందుకు స్టార్ అవుతారో చెప్పలేం. ఏ సినిమా డైలాగ్, ఏ సినిమా పాట ఎప్పుడు ట్రెండ్ అవుతుందో ఎవరికీ తెలీదు. ఒక్కోసారి అంతా మర్చిపోయిన, అసలు అలాంటి పాట ఒకటి ఉందా? అని అనే అనుమానం కలిగే సమయంలో అది రీల్స్ రూపంలో వైరల్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ రీల్స్, సోషల్ మీడియాతో ఓవర్ నైట్ స్టార్లు అయిపోయినవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు మీరు బుల్లితెర, యూట్యూబ్‌లో చూస్తున్న ఎంతో మంది సెలబ్రిటీలు అలా టిక్‌టాక్, డబ్ స్మాష్, స్నాప్ చాట్, ఇన్‌స్టా రీల్స్ వంటి వాటి ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లే. అలా ఇప్పుడు ఒక పాట నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అది ఎప్పుడో 18 ఏళ్ల క్రితం 2004లో విడుదలైన మలయాళం సినిమాలోది. రెయిన్ రెయిన్ కమ్ అగైన్ అనే సినిమాలోని ఓ పాట ఇది. అప్పట్లో ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలియదు గానీ.. ఇప్పుడు మాత్రం రీల్స్ రూపంలో మోతమోగిపోతోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే చాలు అదే పాట. అలాగే యూట్యూబ్‌లో చూసినా కూడా అదే పాట. అటు మీమర్స్ కూడా ఇదే పాట మీద పడ్డారు. దానిపై వచ్చే రీల్స్ ని ట్రోల్ చేస్తూ వాళ్లు కూడా వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తెమ్మా తెమ్మా తెమ్మాడిక్కాతే.. ఇదే మ్యూజిక్కు. ఎక్కడ చూసినా అవే స్టెప్పులు. ముఖ్యంగా అమ్మాయిలు చేసిన రీల్స్ అయితే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
Antra Babu Sava Dengutunaaru 🤧
Amma Nanna Hostel ki Velli Manchiga Chaduvu ko Ani Pampisthe Villu Chese Panulu Ilaa Unatyi…….🥱 pic.twitter.com/Bb3RtA4lfV— Prabhas™ (@Vikram_Rebelism) November 16, 2022
వాటన్నింటిలోకి.. ఒక లేడీస్ హాస్టల్ అమ్మాయిలు చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. హాస్టల్ ఉన్న అమ్మాయిలు అంతా కలిసి ఆ వీడియో చేశారు. అయితే ఆ వీడియోలో వాళ్లు వేసిన సిగ్నేచర్ స్టెప్పు అనేది కాస్త అభ్యంతరకరంగా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం రీల్స్ చేయడం అనేది సర్వ సాధారణం అయిపోయింది. పాపులర్ అవ్వడానికే కాదు.. టైమ్ పాస్ చేయడానికి కూడా ఈ రీల్స్ చేస్తూ ఉంటారు. ఈ పర్టిక్యూలర్ రీల్ చేసిన అమ్మాయిలు మాత్రం బాగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. అందుకు కారణం వాళ్లు ఎంచుకున్న స్టెప్ అనే చెప్పాలి. అంతేకాకుండా హాస్టల్ కాలేజ్, క్యాంటిన్ ఇలా అన్ని ప్రదేశాల్లో ఇదే స్టెప్పు వేస్తూ వీడియో చేశారు. అలా చేయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. కొందరు మాత్రం అందులో తప్పేముంది? వాళ్లేదో సరదాకి చేశారు అంటూ సమర్థిస్తున్నారు.
Reyyyy 😳😂😂 pic.twitter.com/k3ptSYPzBw
— Charanism™ (@RohitCharan_45) November 16, 2022
Temma Temma Song Ft.Tollywood 😁🤎Comment On Sync #Trending pic.twitter.com/gqgCTPRvoY
— Hyderabad Hawaaa (@tweetsraww) November 17, 2022
என்னடா இது புது ட்ரெண்டிங் ஆஹ் இருக்கு ஆனா நல்லா இருக்கு பாட்டு
🫶🕺💃🫶#themma_themma #trendingvideos #Dance pic.twitter.com/FiA2EyO83O
— வனம் the க்ரூட் 👨🏿🎤 (@vanam_offcl) November 11, 2022