ఈ సమాజంలో వయసుకు ఎత్తుకు తేడా లేకుండా చాలా మంది కనిపిస్తుంటారు. అలా మనం ఎంతోమంది మరుగుజ్జు వ్యక్తులను చూసే ఉంటాం. వారు కేవలం 4 లేదా 5 అంగుళాలు ఉంటారు. వీరిని చూసి చాలా మంది ఆశ్యర్చపోతుంటారు. ఇక వైద్యుల ప్రకారం చూసుకుంటే మాత్రం తల్లిదండ్రుల హర్మాన్స్ ఆధారంగా ఇలా పుట్టే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇకపోతే ప్రపంచంలో 4 అంగుళాల కంటే అంతకంటే ఇంకా పొట్టి వ్యక్తులు ఉంటారన్న సంగతి మీకు తెలుసా? అవును.. మీరు విన్నది. ఇప్పటి వరకు ప్రపంచంలో అతి పొట్టి మనిషిగా కొలంబియాకు చెందిన ఎడ్వర్డ్ నినో హెర్నాండెజ్ ఉండేవాడు. కేవలం ఉండడమే కాకుండా ఇతడు ప్రపంచంలో అతి పొట్టి రికార్డులోకి ఎక్కాడు.
కానీ అతని కంటే ఇంకా పొట్టిగా నేనున్నానంటూ వచ్చాడు మన అఫ్సిన్ ఘదెర్జాదేహ్ (20). ఇరాన్ కు చెందిన అఫ్సిన్ ప్రపంచంలో అతిపొట్టి మనిషి గిన్నిస్ రికార్డులోకెక్కాడు. అతడు ఎత్తు 65.24 సెంటీమీటర్లు, 2 అడుగుల 1.68 అంగుళాలు ఉన్నాడు. ఇతడి ఎత్తును పరిశీలించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు అందులో చోటు కల్పించారు. ఇక మరో విషయం ఏంటంటే..? గతంలో ప్రపంచంలోనే అతిపొట్టిగా మనిషికి రికార్డు సృష్టించిన ఎడ్వర్డ్ నినో హెర్నాండెజ్.. అఫ్సిన్ ఘదెర్జా దేహ్ కంటే 7 సెంటీమీటర్లు ఎక్కువగా ఉండడం విశేషం. దీంతో ఇప్పుడు అఫ్సిన్ ఘదెర్జాదేహ్ ప్రపంచంలోనే అతిపొట్టి మనిషిగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కాడు.