ప్రతి ఒక్కరిలో ప్రతిభ అనేది దాగి ఉంటుంది. అయితే సాధించాలనే పట్టుదల, కసి ఉంటే చాలు ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. అలా తమలోని టాలెంట్ ను బయటకు తీసి.. ఎందరో యువత రికార్డులు కొల్లగొడుతున్నారు. తమదైన ప్రతిభతో యువత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకుంటున్నారు. తాజాగా బీహార్ కు చెందిన ఓ యువకుడు కూడా నిజంగానే ఓ అందర్ని ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అందరు అతడ్ని స్టంట్స్ రారాజు, హెడ్ మ్యాన్ గా అని పిలిస్తుంటారు. అలాంటి యువకుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఇంతకి ఆ యువకుడు ఎవరు.. అతడు చేసిన అద్భుతం ఏమిటనే కదా మీ సందేహం. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
బీహార్ కు చెందిన ధర్మేంద్ర కుమార్ ను స్థానికంగా అందరూ స్టంట్స్ రారాజు, హెడ్ మ్యాన్ అని పిలుచుకుంటారు. రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో జరిగిన పలు రకాల బైక్ పోటీల్లో పాల్గొన్న ధర్మేంద్ర కుమార్ అనేక పతాకాలను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాక పలు రికార్డులను తన పేరున లిఖించుకున్నారు. అందుకే ధర్మేంద్ర కుమార్ కు హెడ్ మ్యాన్ అనే బిరుదు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 122 కిలోల బరువున 114 సీసీ బైక్ ను భుజంపై మోస్తూ కేవలం 30 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తి అందరని ఆశ్చర్యానికి గురిచేశారు.
ఈ పరుగు పోటీల్లో అతడి దరిదాపుల్లో కూడా ఎవరు లేకపోడవంతో విజేతగా నిలిచాడు. 2022 డిసెంబరు 31న త్రిపుర రాజధాని అగర్తలాలో బైక్ ను మోస్తూ పరిగెత్తే పోటీలు నిర్వహించారు. మన దేశంతో పాటు 21 దేశాలకు చెందిన వారు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారందరిని వెనక్కి నెట్టి.. ధర్మేంద్ర విజేతగా నిలిచాడు. ఈ పోటీల్లో 122 కిలోల బరువు 114 సీసీ ఉన్న బైక్ ను మోస్తూ 30 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తాడు. ఈ పోటీల్లో ధర్మేంద్ర విజేతగా నిలవడమే కాకుండా వరల్డ్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నాడు. తాను సృష్టించిన ఈ రికార్డును బద్దలు కొట్టాలని ప్రపంచ దేశాలకు సవాలు చేస్తునట్లు పోటీల అనంతరం ధర్మేంద్ర తెలిపారు.