ఈ మద్య ప్రతి ఒక్కరూ.. ప్రతి చిన్నవిషయానికీ గూగుల్‌ని ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు రూట్స్ తెలియనప్పుడు అడ్రస్ కోసం గూగుల్ మ్యాప్స్‌ని ఆశ్రయించడం సర్వసాధారణంగా మారింది. చాలా మంది ఈ గూగుల్ మ్యాప్ నమ్మకుని భంగపాటుకు గురైన సందర్భాలున్నాయి. ఓ ఆటో డ్రైవర్ గూగుల్ మ్యాప్ ని అనుసరిస్తూ ఏకంగా బ్రిడ్జీపైకి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
వీడియోలో కనిపిస్తున్నట్టు.. ఓ ఆటో డ్రైవర్ ఏకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి ఆటో నడిపిస్తున్నాడు. తనకు తెలియకుండానే గూగుల్ మ్యాప్ ని ఫాలో అయి యూటర్న్ తీసుకోవాల్సిందిపోయి.. ఏకంగా తన ఆటోను ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కించి ఉంటాడేమో అని అందరూ తెగ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన వారు రక రకాలుగా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో పై మీ అభిప్రాయా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
When Google Maps shows you to take the bridge pic.twitter.com/JfyShdiPzS
— Rajabets India🇮🇳👑 (@smileandraja) August 18, 2022