చాలా సినిమాల్లో చూసే ఉంటాం.. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లాయర్ బల్లలు గుద్ది మరీ కేసు వాదిస్తుంటారు. తమ సైడు వాళ్లను రక్షించటానికి సాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. సినిమాల్లో చూపించే దానికి నిజంగా కోర్టులో జరిగే ప్రాసిక్యూషన్‌కు చాలా తేడా ఉంటుంది. కోర్టుల్లో విచారణ చాలా సైలెంట్‌గా జరిగిపోతుంది. ఇక, కేసు వాదిస్తున్న సమయంలో కోర్టులో గొడవలు పడ్డం అన్నది కేవలం సినిమాల్లోనే జరుగుతుంటుంది. ముఖ్యంగా హీరో కోర్టులోనే విలన్ బెండు తీస్తాడు. అచ్చం ఇలాంటిదే కాకపోయినా ఓ అరుదైన సంఘటన తాజాగా చోటుచేసుకుంది. ఏకంగా కోర్టులోనే ఇద్దరు లాయర్లు గొడపడ్డారు. అది కూడా లేడీ లాయర్లు. ఇద్దరూ జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు.
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాజాగా, ఉత్తర ప్రదేశ్, కాస్‌గంజ్‌లోని కోర్టులో ఓ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఓ ఇద్దరు మహిళా లాయర్లకు గొడవ మొదలైంది. ఆ గొడవ ఎందుకు మొదలైందో తెలీదు కానీ, కొద్దిసేపటికే గాలి వానలా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలుపెట్టారు. జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. పక్కనే ఉన్న వారు ఎంత విడిపించినా వాళ్లు ఆగలేదు. పందెం కోళ్లలా కొట్టుకున్నారు. చీరలో ఉన్న లాయర్ సాధారణ దుస్తుల్లో ఉన్న లాయర్‌ను చావకొట్టింది. ఎన్ని దెబ్బలు తిన్నా సాధారణ దుస్తుల్లో ఉన్న లాయర్ ఆగలేదు.
చీరలో ఉన్న లాయర్‌పై దాడికి వెళ్లింది. మళ్లీ దెబ్బలు తింది. కొద్దిసేపటి తర్వాత ఓ మహిళా పోలీస్ అక్కడికి వచ్చింది. ఇద్దరినీ గొడవ పడకుండా ఆపింది. అంతటితో గొడవ ఆగిపోయింది. అయితే, ఇంత గొడవలోనూ కొంతమంది లాయర్లు వీడియోలు తీసుకోవటం ఆపలేదు. అదే పనిగా యాంగిల్స్ చూసుకుని మరీ వారి గొడవను చిత్రీకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు కోర్టులో కొట్టుకోవటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇలా లాయర్లే గొడవపడి జైలు కెళితే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
महिला वकीलों में जमकर मारपीट, एक-दूसरे के खींचे बाल, जमकर बरसाए थप्पड़।
वीडियो हुआ वायरल… यूपी के कासगंज से सामने आया मामला pic.twitter.com/vhpZvRdiMP
— News24 (@news24tvchannel) October 28, 2022