కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవటం చాలా ముఖ్యమైనది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాపాయం సంభవించొచ్చు. అందుకే తప్పని సరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నది ట్రాఫిక్ రూల్. అయితే, సీట్ బెల్ట్ కారులో ఉన్న వాళ్లకే కాదు.. బండి నడుపుతున్న గాడిదకు కూడా రక్షణగా నిలిచింది. గాడిద నడుముకు సీటు బెల్ట్ లాంటి తాళ్లు లేకపోయి ఉంటే ఈ పాటికి అది చనిపోయి ఉండేది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి తన గాడిద బండితో రోడ్డుపై వెళుతూ ఉన్నాడు. బండి నాలుగు రోడ్ల కూడలి దగ్గరకు వచ్చింది. గాడిద ఓ మోస్తరు వేగంతో నడుచుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే వెనకాలి నుంచి ఓ కారు వేగంగా వచ్చింది. అంతే వేగంతో గాడిద బండిని ఢీకొట్టింది. దీంతో గాడిద బండి సర్రున ముందుకు దూసుకుపోయింది.
బండిపై ఉన్న వస్తువుల బరువుకు గాడిద గాల్లోకి లేచింది. అప్పుడు దాని వీపు, మెడ భాగంలో ఉన్న తాళ్లు గాడిదను సీట్ బెల్ట్‌లాగా బండికి పట్టి ఉంచాయి. బండి ముందుకు దూసుకుపోయినా అది గాల్లోనే ఉండి పోయింది. ఎలాంటి ప్రమాదం కలగకుండా ముందుకు వెళ్లి కాళ్లపై నిలబడింది. తర్వాత పరిస్థితి కంట్రోల్‌లోకి రావటంతో నిలదొక్కుకుంది. ఈ హఠాత్పరిణామంతో గాడిద బండి నడిపే వ్యక్తి గుండె ఆగినంతపనైంది. తేరుకోవటానికి కొంత సమయం పట్టింది. అయితే, ఈ ప్రమాదంలో గాడిదకు కానీ, బండి నడిపే వ్యక్తికి కానీ, ఎలాంటి గాయాలు అవ్వలేదు. ఇందుకు కారణం గాడిద మెడకు, నడుముకు ఉన్న సీట్ బెల్ట్ లాంటి తాళ్లే. అవి గనుక లేకపోయి ఉంటే.. కారు ఢీకొట్టిన వేగానికి గాడిద బండికిందపడేది.
బండిపై ఉన్న వస్తువుల బరువుకు నలిగి చనిపోయేది. అంతేకాదు! గాడిద బండి కిందపడితే.. బండి పైకి ఎగరటమో లేక తిరిగిపడటమో జరిగేది. దీంతో బండిపై ఉన్న వ్కక్తికి ప్రమాదం సంభవించేది. మనిషి, గాడిద ఇలా ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి ప్రత్యక్ష కారణం గాడిదకు ఉన్న సీట్ బెల్ట్‌లాంటి తాళ్లే. ఈ ప్రమాదంలో కారు మాత్రం బాగా దెబ్బతింది. దాని ముందు భాగం నుజ్జునుజ్జయింది. ‘‘హస్నా జరూరీ హై’’ అనే ట్విటర్ ఖాతాదారుడు ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ మరి, లోపల ఉన్న వ్యక్తి సీటు బెల్ట్ పెట్టుకున్నాడా? లేదా?’’.. ‘‘సీటు బెల్ట్ మనుషులకే కాదు. జంతువులకు కూడా ముఖ్యమే’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
गधे को सीट बेल्ट ने बचा लिया वर्ना कार वाले ने तो मार दिया था 😅 pic.twitter.com/xTyLv3VJfG
— Hasna Zaroori Hai (@HasnaZarooriHai) October 19, 2022