ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది గుర్తుండిపోయే వేడుక. అయితే ఈ పెళ్లిళ్లలో పాటించే సంప్రదాయాలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. కొన్ని సంప్రదాయాలు ఎంతో పద్దతిగా కనిపిస్తుంటాయి. అయితే మరికొన్ని ప్రాంతంలో పెళ్లిళ్లలో పాటించే సంప్రదాయాలు భలే చిత్ర విచిత్రంగా ఉంటాయి. పెళ్లి కొడుకు చెంబు, గొడుకు పట్టుకుని పారిపోతే బలవంతంగా ఎత్తుకుని రావడం, పెళ్లి కూతురిని చెంప దెబ్బ కొట్టడం వంటి విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఇలా పెళ్లిళ్లలో జరిగే అనేక సందడి సన్నివేశాలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్ళి పీటలపైనే భార్యభర్తలు పిచ్చ పిచ్చగా కొట్టేసుకున్నారు. ఈ వీడియో పై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
ఈ భూమి మీద అనేక రకాల సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. ప్రాంతాన్ని పట్టి ఆచారాలు ఉంటాయి. అక్కడి ప్రాంతం వారికి మాములే అనిపించే సాంప్రదాయాలు మరొక ప్రదేశం వాళ్లకు విచిత్రంగా ఉంటాయి. అలా మనకు తెలియని వింత ఆచారాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని చూస్తే ఒకొక్కసారి భయం వేస్తుంది. మరి కొన్ని చూస్తే తెగ నవ్వొస్తుంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా నేపాల్లో జరిగిన ఒక వింత ఆచారానికి సంబంధించింది. హిందు దేశం అని నేపాల్ ను పిలుస్తారు. అయితే అక్కడ పెళ్లిళ్లు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి వేదిక పైనే అందరు చూస్తుండగానే పెళ్లి కొడుకును పెళ్లి కూతురు పిచ్చ పిచ్చగా కొట్టింది.
అక్కడి సంప్రదాయం ప్రకారం.. నూతన వధువు వరులు ఒకరినొకరు చిన్నగా కొట్టుకోవాలంట. అందులో భాగంగానే పెళ్లి కొడుకు చిన్నగా పెళ్లి కూతురి చెంపపై కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో వధువుకు ఏమనుకుందో ఏమో కానీ అతడి పైకి శివంగి లాగా దాడి చేసింది. ఎవరు పట్టుకున్న ఆగలేదు. దీంతో పెళ్లికి హాజరైన బంధువులందరూ పగలపడి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.