మహా కవి కాళిదాసు కలం నుండి జాలువారిన అద్భుతమైన రచనల్లో ఒకటి అభిజ్ఞాన శాకుంతలము. దీని ఆధారంగా రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. డేరింగ్ డైరెక్టర్ గుణ శేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. వచ్చే నెల 17న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, మల్లికా.. మల్లికా సాంగ్ సినిమాపై మరింత హైప్ ను తెచ్చాయి.
ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. శకుంతల, దుష్యంతుల కుమారుడు భరతుడు క్యారెక్టర్ పోషిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో సింహంపై ఠీవిగా కనిపించి కనువిందు చేసిందీ చిన్నారీ. ఇప్పుడు ఆమెకు సంబంధించిన మరో ఫోటో ఇంటర్నెట్ లో దూసుకుపోతుంది. అందులో ఆమె డబ్బింగ్ చెబుతూ కనిపించింది. స్టూడియోలో తన కూతురు డబ్బింగ్ చెబుతున్న పిక్ ను అల్లు అర్జున్ దంపతులు ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆ ఫోటోకు లవ్ సింబల్ ను జోడించారు.
ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. గుణ శేఖర్ కుమార్తె నీలిమా గుణ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు. మెలోడీ బ్రహ్మ మణి శర్మ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా కోసం అటు సమంత ఫ్యాన్స్ తో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా, మహేష్ బాబు నటించనున్న ఓ సినిమాలో అల్లు అర్హ నటించబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సినిమా కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.