ప్రేమకుల రోజు మరింత దగ్గర పడింది. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న జరుపనుండగా.. ఓ ఏడు రోజుల ముందునుంచే సంబరాలు మొదలవుతాయి. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఫిబ్రవరి 10న టెడ్డీ డేగా జరపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు టెడ్డీని బహుమతిగా ఇచ్చుకుంటూ ఉంటారు.
ఈ ప్రపంచంలో టెడ్డీ బేర్ బొమ్మను ఇష్టపడే వాళ్లు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు టెడ్డీ బేర్ బొమ్మను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే అబ్బాయిలు తమకు ఇష్టమైన అమ్మాయిని ఇంప్రెస్ చేయటానికి టెడ్డీ బేర్‌ను గిఫ్ట్‌గా ఇస్తూ ఉంటారు. వాలెంటైన్స్ డేలోని ఏడు రోజుల్లో ప్రత్యేకంగా టెడ్డీ డేను కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున అబ్బాయిలు, అమ్మాయిలకు టెడ్డీలను గిఫ్ట్స్‌గా ఇస్తూ ఉంటారు. అసలు ఈ టెడ్డీ బేర్ ఎలా పుట్టుకొచ్చింది? దీన్ని ఎవరు తయారు చేశారు? బొమ్మల్లో దీనికంత ప్రాధాన్యత ఎందుకు? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..