ఇటీవల కాలంలో కొంత మంది ఆకతాయిలు బస్సులు, ట్రైన్, విమానాల్లో బాంబులు పెట్టామని క్షణాల్లో పేలిపోతుందని బెదిరింపులు రావడం వెంటనే పోలీసులు అలర్ట్ కావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ పట్నం నుంచి ముంబాయి వెళ్తున్న రైలులో బాంబు పెట్టినట్టు ఫోన్ రావడంతో ఒక్కసారే ఉలిక్క పడ్డారు. ఈ క్రమంలో రైల్వే రక్షక దళం పోలీసులు కాజీపేటలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ ను నిలిపివేశారు. ఆ రైల్ లో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.
రైలులో అనుమానాస్పదంగా ఉన్న ఏ వస్తువులను వదల్లేదు. డాగ్ స్క్వాడ్ సహాయంతో అన్ని బోగీల్లొ క్షుణ్ణంగా గాలింపు చేశారు. కానీ బాంబు జాడ ఎక్కడా కనిపించలేదని పోలీసులు తెలిపారు. అయితే ఇది ఆకతాయిల పని అయి ఉండవొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం బెదిరింపు కోసమే అజ్ఞాత వ్యక్తి ఈ ఫోన్ చేశాడా? అన్న అంశాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.