నేటికాలం నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. చదువుకున్నవారు యువతకు తగిన అవకాశాలు దొరక్క నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కొందరు యువకుల ఉద్యోగం కోసం డబ్బులు కట్టడానికి కూడా సిద్దపడుతున్నారు. ఇలాంటి వారి బలహీనతు కొందరు మోసగాళ్లు అవకాశం మలుచుకుంటున్నారు. యువకులకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ సంస్థ ఉద్యోగాలు కల్పిస్తామని ఇంటర్ యువకుల వద్ద నుంచి భారీ మొత్తం డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడింది. మోసపోయిన విద్యార్థులు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై నాగేశ్వరావు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన గోపన్ పల్లి సురేష్, శ్రీకాంత్ స్నేహితులు. వీరు భూత్పూర్ గ్రామంలో కళాశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులను కలిశారు. ఒక్కొక్కరు రూ.లక్ష చెల్లిస్తే వారికి ముందుగా రూ.70 వేల విలువైన వాచ్ ఇచ్చి, రూ.15 వేల జీతం, ఇతర అలవెన్సులతో కూడిన ఉద్యోగం కల్పిస్తామని ఆ విద్యార్థులకు సురేష్, శ్రీకాంత్ తెలిపారు. వారి మాటలను కొందరు ఒక్కొక్కరు రూ.లక్ష ఇచ్చారు. ఈ క్రమంలో కొందరికి వాచ్ లు అందించి.. ఈ వాచీలు పెట్టుకొని హైదరాబాద్ లోని చందానగర్ గంగారంలో ఉన్న విహన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ వద్దకు వస్తే ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అంతే కాకా మీరు ఒక్కొక్కరు ముగ్గురి చొప్పున డబ్బులు కట్టిస్తే..మీరు మరింత సందుపాయాలు, నగదు వస్తాయని అన్నారు. ఆశపడ్డ 9 మంది విద్యార్థులు వారు అడిగిన మొత్తంలో డబ్బులు చెల్లించారు. కానీ ఉద్యోగాలు రాలేదు.
దీంతో జాబ్ విషయమై సురేష్ ను నిలదీయగా తాను సంస్థ వారికి డబ్బులు చెల్లిచాను, వారినే అడుగుదాం పద్దండి అంటూ.. చందానగర్ కి తీసుకొచ్చాడు. గంగారంలోని వారు చెప్పిన కార్యాలయానికి వెళ్లి..జాబ్ విషయం గురించి అడిగారు. మీరు చెల్లించిన డబ్బులు మాకు అందలేదు.. శ్రీకాంత్ తీసుకున్నాడు అంటూ సంస్థ వాళ్లు తెలిపారు. అతడు కనిపించకపోవడంతో, మోసపోయామని బాధిత విద్యార్థులు గ్రహించారు. దీనిపై చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇది చైన్ తరహా వ్యవహారంగా ఉండటంతో..చాలా మంది విద్యార్థులు మోసపోయి ఉండచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. మరి.. ఉద్యోగం సంపాదించాలనే యువత బలహీనత తో చాలా మంది మోసలకు పాల్పడుతున్నారు. మరి..ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి:షాకింగ్ సంఘటన.. నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి!