ప్రస్తుతం కాలంలో సమాజంలో ప్రేమ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని మాయమాటలు చెప్పి.. అనేక విధాలుగా వాడుకుని చివరికి ముఖం చాటేసేవారు ఎక్కవయ్యారు.అయితే ఇలా మోసపోయిన చాలా మంది తమలో తాము మానసికంగా కుంగిపోతారు. ఇక గతంలో ప్రేమించిన వాడు మోసం చేస్తే.. ఆ బాధను మనసులోనే దిగమింగుకుని..జీవితాన్ని భారంగా వెల్లదీస్తారు. కానీ కొందరు మాత్రం అలా ఉండరు. మోసం చేసిన వారిపై ధైర్యంగా పోరాడి విజయం సాధిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు ప్రేమించిన యువతిని కాదని.. మరొకరిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు.. అతడికి ఇంటికి వచ్చి రచ్చ చేయడమే కాక బలవంతంగా అతడి చేత తాళి కట్టించుకుంది. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
హైదరాబాద్ లోని రామంతపూర్‌లో నివాసం ఉండే శ్రీకాంత్ అనే యువకుడికి అదే ప్రాంతంలో ఉండే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా కొన్ని రోజులకు వారి మధ్య ప్రేమకు దారి తీసింది. అలా కొంతకాల ఇద్దరు తెగ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత శ్రీకాంత్ ప్రేమించిన యువతిని కాదని.. ఆమెకు తెలియకుండా మరొక యువతిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ ప్రియురాలు..తన కుటుంబ సభ్యులను తీసుకుని.. అతడి ఇంటికి వెళ్లింది. తనను ఎందుకు మోసం చేశావని ప్రశ్నించింది. అందుకు శ్రీకాంత్.. తన చేతుల్లో ఏం లేదని.. తనకు వివాహం జరిగిందని అన్నాడు. కానీ శ్రీకాంత్ ప్రియురాలు, ఆమె కుటుంబ సభ్యులు అతడి మాటలకు సంతృప్తి చెందలేదు. శ్రీకాంత్‌ను చితకబాదడమే కాక.. తమ బిడ్డను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఈ బాబు నా బిడ్డ అంటూ.. ఇద్దరు తల్లులు పోరాటం! పోలీసులకే అంతుపట్టని కేసు!
వీరికి మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో శ్రీకాంత్ ఇంటి వద్ద పెద్ద రచ్చ జరిగింది. మహిళ సంఘం సభ్యులు, ప్రేమించిన అమ్మాయికి సంబంధించిన పెద్దలు, శ్రీకాంత్ ని చితకబాదారు. మే27న శ్రీకాంత్ చేత బలవంతగా అతడు ప్రేమించిన యువతితో వివాహం చేశారు. శ్రీకాంత్‌కి ఇష్టం లేని పెళ్లి చేస్తున్న వీడియోలు వైరల్ గా మారడంతో అతడికి బలవంతంగా వివాహం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.