నేటికాలంలోని కొంతమంది యువత ప్రేమ.. ఆకర్షణ..అనే పదాలకు అర్థం తెలియకపోయినా అన్నీ తమ తెలుసనుకుంటున్నారు. ప్రేమ మైకంలో తమ వయసును మరిచిపోయి విష వలయంలో చిక్కుకుంటారు. తెలిసి తెలియని వయస్సులో ప్రేమలో పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ 14 ఏళ్ల యువతి ప్రేమించిన ప్రియుడు దక్కడేమో అన్న ఆందోళనలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
నల్లొండ జిల్లా తిరుమల గిరి మండలం నాగార్జున పేట తండాకు చెందిన ఆంగోతు పాప, కమిలి దంపతులు హైదరాబాద్ లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు , కుమార్తె ఆంగోతు ఇందు(14) దేవరకొండలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది.అదే గ్రామానికి చెందిన బాణావత్ వినోద్(20) అనే యువకుడు దేవరకొండలోని ఓ ప్రైవేటు కాలేజిలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. ఇది ఇలా ఉంటే కరోనా సమయంలో స్కూల్ మూతబడటంతో తల్లిదండ్రులతో కలసి ఇందు బత్తాయి పనులకు వెళ్లేది. వినోద్ ది కూడా అదే గ్రామం కావడంతో వారితో పాటే కూలి పనులకు వెళ్లేవాడు.
ఈ క్రమంలో ఇందు, వినోద్ ల మధ్య పరిచయం పెరిగి.. ప్రేమగా మారింది.వీరి ప్రేమ విషయం కొన్నినెలల క్రితం పెద్దలకు తెలిసింది. దీంతో వినోద్ తల్లిదండ్రులు.. ఇందు వాళ్ల అమ్మనాన్నల వద్దకు వెళ్లి.. పెళ్లి ప్రస్తావన తెచ్చారు. తమ కుమార్తెకు ఇంక పెళ్లి వయస్సు రాలేదని, ఇప్పుడే పెళ్లి చేయలేమని చెప్పారు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా ప్రేమించిన వాడు దక్కడేమోనని ఇందు కలత చెంతోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి.. ఆ విషయాన్ని ఆమె పెద్జనాన్నకు చెప్పింది.
వెంటనే ఆ యువతిని నాగార్జునసాగర్ లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇందు మరణానికి ప్రియుడే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ యువతి దారుణమైన నిర్ణయం తీసుకుని తల్లిదండ్రులకు వేదన మిగిల్చింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.