హైదరాబాద్ లో ఇటీవల ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలడంతో సీపీఆర్ చేసి కానిస్టేబుల్ అతడిని కాపాడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మురువకముందే మరో కానిస్టేబుల్ ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి అతడి ప్రాణాన్ని నిలబట్టాడు.
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరినీ గుండెపోటు సమస్య వెంటాడుతోంది. ఈ సమస్యతో రోజుకు ఎంతోమంది కుప్పకూలుతూ చనిపోతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల హైదరాబాద్ లోని అరాంఘర్ చౌరస్తాలో ఓ వ్యక్తి గుండెపోటుతో కిందపడడంతో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ అతనికి సీపీఆర్ చేసి బతికించిన విషయం తెలిసిందే. అతడు చేసిన పనికి స్థానికులతో పాటు పోలీస్ యంత్రాంగం సైతం అభినందించింది. అచ్చం ఇలాగే గుండెపోటుతో కుప్పకూలిన ఓ వ్యక్తిని మరో కానిస్టేబుల్ సీపీఆర్ చేసి అతడి ప్రాణాన్ని నిలబెట్టాడు. అది ఎక్కడంటే?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ వంశీ అనే వ్యక్తి స్థానికంగా చికెన్ సెంటర్ ను నడిపిస్తున్నాడు. అయితే బుధవారం రాత్రి చికెన్ సెంటర్ క్లోజ్ చేసి రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే సడెన్ గా వంశీ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న కిరణ్ అనే కానిస్టేబుల్.. ఇదంతా గమనించి 15 నిమిషాల పాటు ఆ వ్యక్తికి సీపీఆర్ చేశాడు. ఇక కొద్దిసేపటి తర్వాత వంశీ స్పృహలోకి వచ్చి శ్వాస తీసుకోవడ మొదలు పెట్టాడు.
దీంతో వెంటనే వంశీని పోలీసు వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. సీసీఆర్ చేసి వంశీ ప్రాణాన్ని నిలబెట్టడంతో అతడి కుటుంబ సభ్యులు, పోలీసులు.. కానిస్టేబుల్ పై కిరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సైతం కానిస్టేబుల్ కిరణ్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి గుండెపోటుతో చాలా మంది చనిపోతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం పోలీసులకు సీపీఆర్ ఎలా చేయాలనేదానిపై శిక్షణ కూడా ఇస్తున్నారు.
— Hardin (@hardintessa143) March 2, 2023