2023-24కు గానూ తెంలంగాణ బడ్జెట్ ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సుమారు 3వేల కోట్లతో రూపొందించిన వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావ్ ప్రవేశపెట్టారు. రూ. 2,90, 396 కోట్ల విలువైన పద్దును హరీష్ రావ్ ప్రవేశపెట్టడం ఇది నాల్గవసారి. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 3 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఊహించగా.. ఆ లోపే పద్దును రూపొందించారు. 2022-23 తలసరి ఆదాయం రూ. 3,17, 215 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు, మూల ధన వ్యయం రూ. 37,525 కోట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సమయంలో కేంద్రం,తెలంగాణ పట్ల వివక్షను ప్రదర్శించిందని హరీష్ రావ్ ఆరోపించారు. కేంద్ర వార్షిక బడ్జెట్ లో అనేక విషయాల్లో రాష్ట్రానికి మొండి చేయి చూపిందన్నారు.
కరోనా, ఆర్థిక మాద్యం వంటి సంక్షోభాలను తట్టుకొని రాష్ట్రం నిలబడిందని ఈ సందర్భంగా హరీష్ రావు అన్నారు. అయినప్పటికీ కెసిఆర్ హయాంలో అన్నింటా తెలంగాణ ప్రగతి సాధించిందన్నారు. వ్యవసాయానికి రూ. 26, 831 కోట్లు, రోడ్డు, భవనాల శాఖకు రూ. 22,260 కోట్లు, హోం శాఖకు రూ.9, 599 కోట్లు, ఆర్ధిక శాఖకు రూ. 49,749 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ. 12, 161 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ. 26, 885 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 12, 727 కోట్లు కేటాయింపులు చేశారు. ఆసరా ఫించన్ల కోసం రూ. 12వేల కోట్లు, దళిత బంధు కోసం రూ. 17,700 కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36, 750 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ. 15, 233 కోట్లు కేటాయింపులు చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ. 1500 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ. 4,037 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ. 31,426 కోట్లు కేటాయింపులు చేశారు. రైతు బంధు పథకానికి రూ 1,575 కోట్లు, రైతు రుణమాఫీ రూ.6,385 కోట్లు కేటాయించారు.