ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరుతున్నట్టు ఆఫీషియల్‌గా ప్రకటించారు. డిసెంబర్ 7వ తేదీన (మంగళవారం) తాను బీజేపీలో చేరబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా మల్లన్న ప్రకటించారు. ప్రధాని మోడీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన మల్లన్న బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రస్తుతం మల్లన్న వరుస అరెస్టులతో రిమాండ్‌లో ఉన్నారు. మల్లన్నను విడుదల చేయించాలని పీఎం మోడీ, హోం మంత్రి అమిత్‌షాకు మెయిల్ ద్వారా ఆయన భార్య మమత విన్నవించుకున్న విషయం తెలిసిందే.
ఓ స్వామిజీ వద్ద డబ్బులు డిమాండ్ చేశారనే కేసులో పోలీసులు మల్లన్నను అరెస్ట్ చేశారు. తాను బీజేపీలో చేరేందుకు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగానే ట్విట్టర్ వేదికగా జేపీ నడ్డాకు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి, ఇతర బీజేపీ నేతలకు మల్లన్న థ్యాంక్స్ చెప్పారు. ఢిల్లీ వేదికగా నడ్డా ఆధ్వర్యంలో మల్లన్న బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న ఇటీవలే చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.
Completed all things thanks to @bandisanjay_bjp @Arvindharmapuri @kishanreddybjp @vivekvenkatswam @apjithender @aruna_dk @PMuralidharRao @RaghunandanraoM @AmitShah @JPNadda @PMOIndia and all others 7 th December is conform
— Teenmar Mallanna (@TeenmarMallanna) December 4, 2021