తెలంగాణలో ఉన్న అధికార పార్టీపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ తనదైన మాటల భాణాలు వదిలే ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వరంగల్ లో రైతుల మద్దతు తెలిపేందుకు వెళ్తుండగా అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత కొంత కాలంగా వరంగల్ లో రైతులకు ఘోరమైన అన్యాయం జరుగుతుంది.. ల్యాండ్ పూలింగ్ లో కొంత మంది మాఫియాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు తాను రైతులను మేల్కొలుపుతానని తీన్మార్ మల్లన్న వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న అక్కడి లైవ్ ఏర్పాట్లు చేశారు.
తీన్మార్ మల్లన్న వరంగల్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. జనగామ చేరుకున్న ఆయనను ఉదయం పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడ పోలీసులకు, తీన్మార్ మల్లన్న కు మద్య గొడవ జరిగినట్లు సమాచారం. ఇటీవల జైలు నుంచి వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన తాను అధికార పార్టీపై నాయకులపై ఎలాంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయనని శపథం చేశారు. అంతే కాదు త్వరలో తాను ఒక కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తానని అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.