ఈ కాలంలో మహిళలు ఎక్కడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొంది.. ప్రతిరోజూ ఎక్కడ అక్కడ మహిళలపై అత్యాచారాలు, లైంగి వేధింపులకు పాల్పపడుతున్నారు కామాంధులు.
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, వాటి పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమమే ‘ప్రజావాణి’. అలాంటి ఓ ప్రోగ్రామ్‌లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఆ కార్యక్రమంలో ఒక యువకుడు ఇచ్చిన ఫిర్యాదుకు అందరూ పగలబడి నవ్వుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..!
దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని అందరూ అంటూ ఉంటారు. తల్లి ప్రేమ ముందు ఏదీ పనికి రాదన్నది నిర్వివాదాంశం. తల్లి తన కడుపు చూసుకోకపోయినా.. బిడ్డల కోసం ఆలోచిస్తుంది. తాను పస్తులుండి పిల్లల కడుపు నింపుతుంది. అలాంటి తల్లి మీదే కొంతమంది బిడ్డలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆస్తి కోసం, డబ్బు కోసం ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా, ఓ కుమారుడు తన తల్లిని ఆస్తి కోసం దారుణంగా హత్య చేశాడు. చెల్లెలికి పొలం రాసిచ్చిందన్న కోపంతో […]
ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. డబ్బు మీద ఉన్న ప్రేమ కన్న తల్లిదండ్రుల మీద ఉండటం లేదు. పేగు తెంచుకున్న బంధాన్నే నేడు కాదు పొమ్మంటున్నారు. అదేంటి అని అడిగితే నా ఉద్యోగం, నా జీవితం అంటూ సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆన్సరే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎదురైంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఏ తల్లిదండ్రులైన తన కొడుకు ప్రయోజకుడు కావాలని […]
తలచినదే జరిగినదా దైవం ఎందులకు? జరిగినదే తలచితివా ఎదురులేదు నీకు.. ఈ పాట అందరూ వినే ఉంటారు. అవును మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఎదురు ఉండదు. కానీ, విధి కొన్నిసార్లు మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది. అలా ఈ అమ్మాయిని వెక్కిరించిన విధి ఆమె తల్లిదండ్రుల జీవితాల్లో విషాద ఛాయలు నింపింది. అమ్మా బడికి వెళ్లొస్తానంటూ వెళ్లిన అమ్మాయి.. తిరిగి రాని లోకాలు వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్కపల్లిలో […]
తెలంగాణలో ఉన్న అధికార పార్టీపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ తనదైన మాటల భాణాలు వదిలే ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వరంగల్ లో రైతుల మద్దతు తెలిపేందుకు వెళ్తుండగా అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత కొంత కాలంగా వరంగల్ లో రైతులకు ఘోరమైన అన్యాయం జరుగుతుంది.. ల్యాండ్ పూలింగ్ లో కొంత మంది మాఫియాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు తాను రైతులను […]
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం జనగామలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని, జిల్లా టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం సాయంత్రం యశ్వంత్పూర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. కేంద్ర సర్కార్ పై, బీజేపీపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ‘‘సమైక్య పాలనలో నష్టపోయిన తెలంగాణ మనం పెట్టుకున్న పాలసీలతో మెరుగుపడుతోంది. రైతుబంధు ఇస్తున్నాం. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 8 రోజుల లోపు రూ.5లక్షలు వారి […]
తెలంగాణ వ్యాప్తంగా మోదీ వ్యాఖ్యలకు నిరసనగా.. టీఆర్ఎస్ ఆందోళనలకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా 2022, ఫిబ్రవరి 09వ తేదీ బుధవారం నల్లజెండాలతో నిరసన తెలుపుతున్నారు. తాజాగా జనగామలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. అయితే, ఆ ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కర్రలతో ఇరు వర్గాల మద్య దాడులు కూడా జరిగాయి. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా […]
ప్రేమిస్తున్నానంటూ నటించి లైంగికంగా లోబర్చుకుని గర్భవతిని చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. గట్టిగా నిలదీస్తే తూతూమంత్రంగా పెళ్లి చేసుకున్నాడు. మళ్లీ కొన్ని రోజులకు వదిలేసి ఇంటికి చేరుకున్నాడు. ఇప్పుడా యువతి తనకు న్యాయం చేయాలని మోసం చేసిన వ్యక్తి ఇంటి ముందు నిరసనకు దిగింది. ఈ ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలోని బోడుప్పల్ శ్రీసాయిరాం నగర్‌లో చోటుచేసుకుంది. జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ప్రణీతకు గత ఐదు సంవత్సరాలుగా ప్రశాంత్‌తో పరిచయం […]