ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అనేది బిజినెస్ డెవలప్ మెంట్ కి ప్రధాన ప్లాట్ ఫామ్ అయింది. ఎలాంటి బిజినెస్ అయినా కాస్త పాపులారిటీ కలిగిన సెలబ్రిటీలను లేదా సినీ స్టార్స్ చేత ప్రమోషన్స్ చేయిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బైక్ టాక్సీ బిజినెస్ రాపిడో(Rapido) సంస్థను స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ రాపిడో యాడ్ ని తీవ్రంగా వ్యతిరేకించి.. ఆ సంస్థ పై కోర్టులో కేసు వేసి యాడ్స్ ఆపేశారు. తాజాగా రాపిడో యాడ్ ఇన్సిడెంట్ పై సజ్జనార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ. ‘దశాబ్దాల చరిత్ర కలిగిన ఆర్టీసీ సంస్థని కించపరిచేలా ఉందని.. మీ ప్రోడక్ట్ గురించి గొప్పగా చెప్పుకోండి. కానీ అవతల వారి సర్వీస్ ని కించపరచకూడదు. అలాగే పాపులారిటీ కలిగిన సెలబ్రిటీలు, సినీ స్టార్స్ ఇలాంటి వాటికి సపోర్ట్ చేయొద్దని’ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాటలు యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి. మరి వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.