కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన చేపట్టిన ఈ యాత్ర కేరళలో మొదలై తమిళనాడు, కర్ణాటక మీదుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యాత్రను కొనసాగించాడు. పాద యాత్రలో రాహుల్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న జనానికి అభివాదాలు చేస్తూ, చిరునవ్వుతో నమస్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. సంగారెడ్డి నియోజక వర్గంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉండగా యాత్ర మధ్యలో విరామ సమయంలో ఆ రాష్ట్ర నాయకులతో కలిసి ముచ్చటించారు. వారితో కలిసి రాహుల్ గాంధీ వంట చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణాలో ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో స్థానిక నేతలు ఎంతో ఉత్సహాగా పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక, భట్టి విక్రమార్క, సంపత్ కుమార్ వంటి పలువురు ఇతర నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. అయితే..జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మధ్య చిన్న రన్నింగ్ పోటీ జరిగింది. జోడో యాత్రలో రేవంత్ రెడ్డిని..రాహుల్ గాంధీ పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డి, రాహుల్ కొరడాతో కొట్టుకున్నారు. దారి పొడవున ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ రాహుల్ ముందుగు సాగాడు. ఇలా సాగుతున్న క్రమంలో తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జోడో యాత్రకు విరామం ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్యనేతలతో కలిసి అతి సాధారణం మనిషిలాగా మారిపోయి రాహుల్ ముచ్చటించారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని రాహుల్ తెలిపారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్క..తన నియోజకవర్గంలోని ఆదివాసీలను రాహుల్ కి పరిచయం చేసింది. ఈక్రమంలోవారు.. తమ సంప్రదాయాల గురించి రాహుల్ కు వివరించారు. వారు చెప్పిన విషయాలపై ఎంతో ఆసక్తి కలిగిన రాహుల్.. తానే స్వయంగా ‘బొంగులో చికెన్’ను తయారు చేశాడు. అనతంరం అందరు కలిసి ఆ వంటను ఆరగించారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఇతర నాయకులు అంత ఓ పచ్చటి ప్రదేశంలో రాహుల్ కలిసి కూర్చున్నారు. ఈ సమయంలో అందరు ఎంతో సరదగా ముచ్చటించుకున్నారు. మధీర ఎమ్మెల్యే భట్టీ విక్రమార్క ఆదీవాసీల పండగల గురించి, ఆ సమయంలో వారు ఉపయోగించే ప్రత్యేక పండ్ల గురించి రాహుల్ గాంధీకి వివరించారు. అతి సామాన్య వ్యక్తిగా రాహుల్ గాంధీ మారిపోయి.. అక్కడి వచ్చిన ఆదీవాసీలతో కలసి వంటలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. “రాహుల్ ఈజ్ గ్రేట్” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ వంట చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.