స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదాలకు కేంద్ర బింధువుగా ఉండే ఈయన పై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ అధిష్టానం జోక్యం చేసుకొని ఈ గొడవకు పులిస్టాప్ పెట్టినట్టు తెలుస్తుంది.
ఇటీవల ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తేనె టీగలు దాడి చేశాయి. వెంటనే సిబ్బంది అలర్ట్ అయి ఆయనను తేనె టీగలు దాడి నుంచి కాపాడారు. వివరాల్లోకి వెళితే..
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కు సోమవారంనాడు జిల్లా పర్యటనలో భాగంగా తన వాహనంలో బయలు దేరారు. అదే సమయంలో జిల్లాలోని ఉప్పుగల్ వద్ద జరిగిన బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యే కు హాజరయ్యారు. జాతరలో భాగంగా స్థానికులతో పాటు ఎమ్మెల్యే దివిటీలు వెలిగించారు. అక్కడే చెట్లపై తేనె టీగలు ఉన్న విషయం గమనించలేదు. దివిటీల పొగకు తేనె టీగలు ఒక్కసారే జనాల మీద దాడి చేశాయి. వెంటనే ఎమ్మెల్యే సిబ్బంది అప్రమత్తం అయి రాజయ్యను వాహనంలోకి ఎక్కించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తేన టీగల దాడిలో జాతరకు వచ్చిన భక్తులకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే తనను కొంత కాలంగా రాజయ్య వేధిస్తున్నారని అదే పార్టీకి చెందిన మహిళా సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలంగాణలో సంచలనం రేపింది. ఈ విషయం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే మనస్ఫూర్తిగా క్షమించాల్సింది కోరుతున్నట్లు ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దల ఆదేశాల మేరకు సర్పంచ్ ఇంటికి వెళ్లిన రాజయ్య.. ఆమెకు క్షమాపణలు చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి మూడు రోజుల నుంచి జరుగుతున్న రగడకు బీఆర్ఎస్ అధిష్టాన్ం పులిస్టాప్ పెట్టినట్టు తెలుస్తుంది.