ఇటీవల తెలంగాణ విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వివక్ష చూపిస్తుందిని.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీయకుండా భాజపా నాయకులు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాల పై మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర భాజపా నాయకుల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. సీఎం కేసీఆర్‌కు, తెరాసకు మంచి పేరు వస్తోందన్న అక్కసుతోనే కేంద్రం కొత్త కిరికిరి పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు.
వరి వేయద్దని రైతులకు తాము సూచిస్తే.. రెచ్చగొట్టి మరీ వరి వేసేలా చేశారని రాష్ట్ర భాజపా నాయకులపై ధ్వజమెత్తారు. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ నాటకాలు ఆడుతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ను పోస్ట్ చేశారు. అన్నదాతలు దేనికైనా సిద్దంగా ఉంటారు.. ఇది పోరాటా పురిటి గడ్డ.. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటమని తెలిపారు.
యాసంగి వడ్లు కేంద్రం కొనుగోలుకు సిద్ధంగా లేదని ముందే రైతులకు సూచించిన కెసిఆర్ !!
రైతులను రెచ్చగొట్టి వరి వేయించి, ఇపుడు యసంగీ ధాన్యం కొనమంటే కేంద్రం నాటకాలు చేస్తోంది!
ఇది *అన్నదాత పోరాటం మాత్రమే కాదు* ఇది తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం* pic.twitter.com/zrmOpSWQZ4
— KTR (@KTRTRS) April 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.