ఈ మద్య కొంత మంది ప్రజా ప్రతినిధులు తమ స్థాయిని పక్కన బెట్టి సామాన్యుల కోసం పాటుపడటం.. కార్యకర్తల కోసం ముందుకు రావడం చూస్తూనే ఉన్నాం. తన గురువు నేత బిల్లా సోమిరెడ్డి మరణించారని వార్త తెలియగానే హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రస్తుతం సోమిరెడ్డి టీఆర్ఎస్ ముఖ్య నాయకుడుగా కొనసాగుతున్నారు. తన గురువు పాడెను చివరి వరకు మోసి తన గౌరవం, అనుబంధాన్ని చాటుకున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఈ సందర్భంగా ఆయన తన గురువు బిల్లా సోమిరెడ్డి గురించి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి తాను రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ఉన్నానని.. పాలకుర్తి నియోజకవర్గంలో మాస్టార్ తనని ఎంతగానో ప్రోత్సహించారని.. ఆయన దీవెనల వల్లనే ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. అంతగొప్ప గురువు ఇప్పుడు లేకుండా పోయారని తల్చుకుంటే కన్నీరు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ‘అంటే సుందరానికి’ ప్రీరిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్..!
ఆయన ఎంతో మందికి రాజకీయ స్ఫూర్తి.. తెలంగాణ స్వరాష్ట్ర పోరాటంలో ఎంతో చురుకుగా పాల్గొన్నారని అన్నారు. ఇటీవల గ్రామ పంచాయితీల విషయంలో రక రకాల వార్తలు వస్తున్నాయని.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కావాలనే సర్పంచులను రెచ్చగొడుతున్నారన్నారు. తెలంగాణలో కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పర్చామని అన్నారు.