తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పుట్టినరోజు ఇవాళ (డిసెంబర్ 21). భార్య పుట్టినరోజు కావడంతో ట్విట్టర్ వేదికగా స్వీట్ విషెస్ తెలియజేశారు నారా లోకేష్. ‘హ్యాపీ బర్త్ డే బ్రాహ్మణి నారా. నేను కలిగిన కూలెస్ట్ ఫ్రెండ్ వి నువ్వు. నేను కల కన్న ఉత్తమ సోల్ మేట్ వి. హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. నారా లోకేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నందమూరి, నారా వారి అభిమానులు, టీడీపీ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా నారా బ్రాహ్మణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక లోకేష్ రాజకీయంగా బిజీగా ఉంటే.. బ్రాహ్మణి కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు, ఇతర పనులు చూసుకుంటారు.
నారా వారి హెరిటేజ్ సంస్థలో బ్రాహ్మణి కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా చాలా చురుగ్గా ఉంటారు. బాగా చదువుకున్నారు కూడా. హీరోయిన్స్ ని మించిన అందగత్తె. సౌందర్యంలోనే కాదు.. బైక్ రైడింగ్ లోనూ ఆమె ధైర్యశాలి అని నిరూపించారు. లేహ్ నుంచి లద్దాఖ్ వరకూ నారా బ్రాహ్మణి సాహస యాత్ర చేశారు. మగాళ్ళకేమాత్రం తీసిపోని విధంగా బైక్ రైడ్ చేసి ఔరా అనిపించారు. ఆమె గొప్ప వ్యక్త కూడా. అద్భుతంగా మాట్లాడతారు. 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో లోకేష్ తరపున మంగళగిరిలో ప్రచారం కూడా చేయించారు.
హీరోయిన్స్ కేం తీసిపోని అందం ఉన్నా సినిమాల్లోకి రాలేదు. కనీసం రాజకీయాల్లోకి వచ్చినా బాగుండేది అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. 2007లో నారా లోకేష్, బ్రాహ్మణిల వివాహం జరిగింది. 2015లో వీరికి దేవాన్ష్ అనే కొడుకు పుట్టాడు. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెపై ఉన్న ప్రేమను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు నారా లోకేష్. మరి గొప్ప భార్యగా, గొప్ప తల్లిగా, ఇల్లాలుగా, గొప్ప కోడలిగా, గొప్ప బిజినెస్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న నారా బ్రాహ్మణికి మీరు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి.
#HappyBirthday @brahmaninara . You are the coolest friend I could ever have and the best soul mate I could ever dream of. Love you from the bottom of my heart ❤️
— Lokesh Nara (@naralokesh) December 21, 2022