హైదరాబాద్ శివారు పరిధిలోని హయత్‌నగర్ లో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో గంజాయి వాడకం కలకలం రేపింది. ఇంజినీరింగ్ విద్యార్థులు పుట్టినరోజు వేడుకల పేరుతో పసుమాముల వద్ద ఓ ఫాంహౌస్ లో గంజాయి సేవిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు సదరు ఫాంహౌస్ పై ఆకస్మిక దాడులు చేశారు. అక్కడ గంజాయి లభ్యం కావడంతో పలువురు ఇంజనీరింగ్ అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు.
ఓ బీటెక్ కాలేజీ స్టూడెంట్ పుట్టినరోజు వేడుకలకు తోటి బీటెక్ స్టూడెంట్స్ ను ఆహ్వానించినట్లు ప్రాథమికంగా తేల్చారు పోలీసులు. ఈ దాడుల్లో మొత్తం 33 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 29 మంది అబ్బాయిలు కాగా, మిగిలిన నలుగురు అమ్మాయిలు. అలాగే.. విద్యార్థుల నుంచి 10 కార్లు, బైకులు, 28 వరకు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారంతా విద్యార్థులు కావడంతో వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కేసు నమోదు చేయకుండా.. పట్టుబడిన విద్యార్థుల తల్లితండ్రులని పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయితే వీరికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై విచారణ చేపట్టారు. ఇక్కడ పట్టబడ్డ వారందరూ ఏయే కాలేజీకి చెందిన విద్యార్థులన్నది తెలియాల్సి ఉంది.