ఇద్దరూ ప్రేమించుకుంటారు.. కానీ అనుకోని కారణాల వల్ల.. ఆ మహిళకు మరో వ్యక్తితో వివాహం అవుతుంది. అతడికేమో కట్టుకున్న భార్య అంటే ప్రాణం.. ఆమె ఏమో.. ప్రియుడిని మర్చిపోలేక.. ఇటు భర్తకు దగ్గర కాలేక.. ఇబ్బంది పడుతుంది. సినిమాలో అయితే.. సామాజిక కట్టుబాట్లకు అనుగుణంగా.. భార్య వివాహ బంధంలోని గొప్పతనాన్ని అర్థం చేసుకుని.. భర్తే కావాలనుకుంటుంది. అలా సినిమాలో ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ముగుస్తుంది. కానీ ఇలాంటి స్టోరీ వాస్తవంగా చోటు చేసుకుంటే.. అప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాలంటే.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలి.
హైదరాబాద్ పాతబస్తీలో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వెలుగు చూసింది. చాంద్రాయణగుట్టకు చెందిన ఓ మహిళ.. భర్తను వదిలించుకునేందుకు వేసిన మాస్టర్ ప్లాన్ చూసి పోలీసులే అవక్కయ్యారు. ఏం తెలియని అమాయకురాలిలా నటిస్తూ.. భర్తను బుట్టలో వేసుకుంది. అతడు తనను పూర్తిగా నమ్ముతున్నాడు అని అర్థం అయ్యాక.. ఓ రోజు భర్తకు టీలో నిద్రమాత్రలు కలిపిచ్చి.. ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు తీసుకుని ప్రియుడితో పారి పోయింది. రెండ్రోజుల తర్వాత భర్తకు మెలకువ వచ్చింది. ఇంట్లో వెతగ్గా భార్య కనిపించలేదు. దాంతో తన వైఫ్ మిస్సింగ్ అంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చాంద్రాయణగుట్టకు చెందిన వ్యక్తికి ఏడు నెలల క్రితం ఆలియా అనే మహిళతో వివాహం అయ్యింది. అయితే ఆలియాకు పెళ్లంటే ఇష్టం లేదు. కారణం మరొకరిని ప్రేమిస్తోంది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పినా వారు వినలేదు. బలవంతంగా ఆమెకు వివాహం చేశారు. పెళ్లైన తర్వాత కూడా ప్రియుడిని మర్చిపోలేకపోయింది ఆలియా. అతడితో కాంటాక్ట్‌లో ఉండేది. ఈ క్రమంలో భర్త దగ్గర నుంచి వెళ్లిపోయి.. ప్రియుడితో కలిసి ఉండాలని నిర్ణయించుకుంది ఆలియా. దానిలో భాగంగా.. భర్తకు టీలో నిద్రమాత్రలు వేసి ఇచ్చి.. అతడు మత్తులో ఉండగా.. ఇంట్లో ఉన్న నగలు, డబ్బుతో ఉడాయించింది ఆలియా. భర్త ఫిర్యాదుతో పోలీసులు ఆమెను గాలించే పనిలో పడ్డారు
ఇక పోలీసులు ఆలియాను స్టేషన్‌కు తీసుకువచ్చారు. భర్త దగ్గరకు వెళ్లాలని సూచించారు. ఆమె మాత్రం.. ససేమిరా భర్తతో ఉండను అంటోంది. మరోవైపు భర్త ఏమో.. తన భార్య తనకు కావాలని పట్టుపట్టాడు. ఆమె ఇప్పటి వరకు చేసిన వాటిని తాను పట్టించుకోనని చెప్పాడు. అయితే ఆలియా మాత్రం.. భర్తతో వెళ్లేందుకు అస్సలు ఇష్టపడలేదు. తన భార్యను తనతో పంపించాలంటూ భర్త డిమాండ్ చేయగా.. భర్త వద్దు నాకు ప్రియుడే కావాలంటూ ఆలియా మొండికేయసాగింది. వీరి తీరుతో పోలీసులే తలలు పట్టుకున్నారు. ఏం చేయాలో అర్థం కాక.. ముస్లిం మత పెద్దల దగ్గరే తేల్చుకోవాలని సూచించారు.
అయితే అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి రిపీట్ అయ్యింది. మతపెద్దల దగ్గర కూడా ఆలియా ప్రియుడే కావాలని పట్టుబట్టింది. వారు ఎంత నచ్చచెప్పినా వినలేదు. ప్రియుడే ముద్దు.. భర్త వద్దే వదంటూ తెగేసి చెప్పింది. అటు భర్త తన భార్య తనకు కావాలనడం.. ఇటు ఆలియానేమో.. తనకు ప్రియుడే కావాలంటూ పట్టుబట్టడంతో మత పెద్దలు సైతం తలలు పటుకుంటున్నారు. మరి ఈ కథకు ఎలాంటి ముగింపు పడనుందో చూడాలి. మరి ఈ కథకు ఎలాంటి ముగింపు ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.