తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళసై మధ్య కొంత కాలం నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. రాజ్ భవన్ లో జరిగిన ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం. యాదాద్రి ప్రారంభోత్సవానికి గవర్నర్ కి ఆహ్వానం అందకపోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించటం లేదని గవర్నర్ తమిళసై తీవ్ర సంతృప్తిగా ఉన్నారు. తాజాగా ఢిల్లీ టూర్ వెళ్లిన గవర్నర్.. మోదీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
“నేను స్నేహకపూర్వకమైన, రాజ్యాంగ బద్ధమైన వ్యక్తిని. నేను వివాదస్పదమైన వ్యక్తిని కాదు. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. తెలంగాణా ప్రభుత్వంతో సఖ్యతగానే ఉండటానికి ప్రయత్నించాను. నేను ఇక్కడ అధికారం చెలాయించడం లేదు. ఏ విషయంపై అయినా ఈ సీఎంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను. దేనిపైన అయిన బహిరంగ చర్చకు నేను సిద్దంగా ఉన్నాను. ఏ చర్యలు నన్ను ఆపలేవు. తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ప్రధానికి కూడా తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నాకు ఎలాంటి ఇగో లేదు. నాతో భేటీ కోసం సీఎం ఎప్పుడైనా నా ఆఫీస్ కు రావొచ్చు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ ప్రోటోకాల్ తెలీదా? రాజ్ భవన్ ను, గవర్నర్ ను అవమానించారు.. అయినా నేను పట్టించుకోను. ప్రభుత్వం గవర్నర్ కు గౌరవం ఇవ్వకపోవడాన్ని ప్రజలకే వదిలేస్తున్నాను. వరంగల్ ఎంజీఎంలో జరిగిన ఎలుకల దాడిఘటన చాలా బాధ కలిగించింది”అని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. మరి..గవర్నర్ తమిళసై మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.