ఈ మద్య రాజకీయ నేతలు ఆపదలో ఉన్నవారిని రక్షిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాము అత్యవసర పనిపై వెళ్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని స్వయంగా తమ కాన్వాయ్ లో ఆస్పత్రికి తరలించి డాక్టర్లతో మెరుగైన చికిత్స అందించాల్సిందిగా ఆదేశిస్తున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక ప్రయాణీకుడు అస్వస్థతకు లోను కాగా వెంటనే అతనికి ప్రథమ చికిత్స చేసి కాపాడారు. తాజాగా ఆమె మరోసారి ప్రమాదంలో గాయపడ్డ యువకుడికి ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..
పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ కి వస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళ సై మార్గ మద్యలో ఓ యువకుడు ప్రమాదానికి గురైన విషయం గురించి తెలియగానే వెంటనే కారు దిగి అతనికి ప్రథమ చికిత్స అందించారు. ఆమె స్వయంగా కాటన్ తో యువకుడికి గాయమైన చోట క్లీన్ చేశారు. అప్పటికే సిబ్బంది అంబులెన్స్ కి ఫోన్ చేయగా అక్కడ నుంచి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వారితో ఆమె మాట్లాడి యువకుడికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోడ్డుపై ఎవరికైనా ప్రమాదాలు జరిగితే వెంటనే స్పందించి చేతనైన చికిత్స అందించి.. ఆస్పత్రిలో తరలిస్తే మనిషి ప్రాణాలు నిలబెట్టిన గొప్ప పేరు మనకు వస్తుందని అన్నారు.
ప్రస్తుతం తమిళ సై తెలంగాణ గవర్నర్ గానే కాకుండా.. పుదుచ్చేరి లెఫ్ నెంట్ గవర్నర్ గా బాధ్యతలు కొనసాగిస్తున్నారు. స్వతహాగా వైద్యురాలైన ఆమె బీజేపీ నాయకురాలిగా చురుకైన పాత్ర పోషించారు. గవర్నర్ హూదాలో ఉన్నప్పటికీ ఎప్పుడైనా ప్రకృతి విపత్తు సంబవిస్తే తన హూదాను మరిచి బాధితులను స్వయంగా పలకరించేందుకు వెళ్లడమే కాదు.. బాధితులకు సాయం అందేలా చేస్తుంటారు. తనతో ప్రయాణించేవారు ఎలాంటి అస్వస్థతకు లోనైనా వెంటనే వైద్య చికిత్స అందిస్తుంటారు. ప్రస్తుతం తమిళ సై డాక్టర్ గా యువకుడిని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Enroute #Chennai from #Puducherry, immediately stoped my car on seeing a seriously injured road accident victim.
Gave first aid & made arrangements for hospitalization, spoke to hospital authorities for necessary treatment.– Timely help for road accident victims saves lives. pic.twitter.com/l2u9wsiCyh
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 4, 2022