మనిషికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, ఇవి తీర్చుకోవడం కోసం ప్రతి ఒక్కరు నానా కష్టాలు పడతారు. ధనవంతులైతే వారు కోరుకున్నది ఏదైనా క్షణాల్లో తెప్పించుకోగలుగుతారు. నిరుపేదలకు మాత్రం అంత సులువు కాదు. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలను అనుభవించే వారు ఇంకా సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వారికోసం ఓ వ్యక్తి గత నలబై ఏళ్లుగా ఉచితంగా టిఫిన్ అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

ఈరోజుల్లో డబ్బులేకపోతే అయిన వాళ్లను సైతం దూరం పెట్టి చిన్నచూపు చూసే సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. ఆపదలో ఉంటే ఆదుకోవడానికి కూడా ముందుకు రారు. పట్టెడన్నం పెట్టడానికి కూడా ఆలోచిస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో ఓ వ్యక్తి నిరుపేదలకు, చిరు ఉద్యోగులకు, వివిధ వృత్తి పనివారికి ఉచితంగా అల్పాహారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలబై సంవత్సరాల నుంచి ఉచితంగా టిఫిన్ అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలో సుధాకర్ అనే వ్యక్తి ఉచిత టిఫిన్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. రోజుకు వందమందికి పైగా పంపిణీ చేస్తూ అందిరి ప్రశంసలు అందుకుంటున్నారు. సుధాకర్ వాళ్ల నాన్న గత నలబై ఏళ్ల నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇప్పుడు తండ్రి చూపిన బాటలోనే సుధాకర్ కూడా పేదల ఆకలి తీరుస్తున్నారు. నగరంలోని ఇందిరాపార్క్ వద్ద ప్రతి రోజు ఉదయం వేళలో ఇడ్లీలతో కూడిన అల్పాహారాన్ని ఉచితంగా అందిస్తున్నారు. పారిశుధ్యకార్మికులు, డ్రైవర్లు, కూలీలు ఈ ఉచిత అల్పాహారాన్ని పొంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదల ఆకలి తీరుస్తున్న సుధాకర్ ను పలువురు ప్రశంసిస్తున్నారు. ఈయనకు తోడుగా ధరంజీ అనే వ్యక్తి కూడా కొంత డబ్బు ఇచ్చి ఈ సేవలో భాగం పంచుకుంటున్నారు. వీరి సేవలను చూసి పలువురు దాతలు కూడా ముందుకొస్తున్నారు. వీరు చేస్తున్న సమాజ సేవకు పలువురు అభినందిస్తున్నారు.