అన్ని ధరలకు రెక్కలొచ్చాయి. ఉప్పు నుండి కందిపప్పు వరకు అన్ని నిత్యావసర సరకుల ధరలు ఆకాశానికి నిచ్చేనేస్తున్నాయి. అటు కూరగాయ ధరలు చూసి సామాన్యుడు భయపడుతున్నాడు. గతంలో 200 రూపాయలు తీసుకు వెళ్తే.. ఓ సంచి నుండా కూరగయాలు వచ్చేవి.
మనిషికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, ఇవి తీర్చుకోవడం కోసం ప్రతి ఒక్కరు నానా కష్టాలు పడతారు. ధనవంతులైతే వారు కోరుకున్నది ఏదైనా క్షణాల్లో తెప్పించుకోగలుగుతారు. నిరుపేదలకు మాత్రం అంత సులువు కాదు. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలను అనుభవించే వారు ఇంకా సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వారికోసం ఓ వ్యక్తి గత నలబై ఏళ్లుగా ఉచితంగా టిఫిన్ అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.