గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో థియేటర్లో పెద్ద సినిమాల జోరు పూర్తిగా తగ్గిపోయింది. సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్లోకి పెద్ద హీరో సినిమాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీనివాస్-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో నందమూరి నటసింహం బాలకృష్ణని వెండితెరపై చూసిన ప్రేక్షకుల పూనకాలతో ఊగిపోయారు.
అభిమానుల సందడితో థియేటర్లన్నీ సందడిగా మారాయి.. ఈలలు, చప్పట్లు, కేరింతలతో మారుమోగాయి. తాజగా అఖండ ప్రదర్శిస్తున్న థియేటర్లో అగ్ని ప్రమాదం సంబవించింది. థియేటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. అఖండ సినిమాను ప్రదర్శిస్తున్న జెమిని థియేటర్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది.
ఆనందంతో ప్రేక్షకులు సినిమా చూస్తుండగా.. ఒక్కసారే పొగలు.. మంటలు రావడం తో వెంటనే అలర్ట్ అయిన థియేటర్ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు షార్ట్ సర్క్యూట్ తో థియేటర్లు మంటలు చెలరేగినట్లు పేర్కొంటున్నారు.