SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Doctor Harshvardhan Viral Story

చనిపోయి కూడా చావుని జయించాడు! వైరల్ గా.. డాక్టర్ హర్షవర్ధన్ కథ!

జీవితం బుద్భుద ప్రాయం. ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరమూ చెప్పలేము. అప్పటివరకు ఆరోగ్యంగా.. నవ్వుతూ.. తుళ్లుతూ ఉన్న వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. కానీ, చనిపోతామని ముందే తెలిస్తే మాత్రం.. పరిస్థితి దారుణంగా ఉంటుంది.

  • Written By: venkybandaru
  • Published Date - Fri - 7 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చనిపోయి కూడా చావుని జయించాడు! వైరల్ గా.. డాక్టర్ హర్షవర్ధన్ కథ!

చావు ప్రతీ మనిషి జీవితంలోని చివరి మజిలీ. మనం ఎంత గొప్ప వాళ్లము అయినా.. ఎన్ని గొప్ప గొప్ప విజయాలను సాధించినా.. మంచి, చెడులతో ఎలాంటి సంబంధం లేకుండా అందరికీ చివరికి మిగిలేది ఆరు అడుగుల నేలే. మనం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతామని తెలుసు.. కానీ, సరిగ్గా ఎప్పుడు చనిపోతామో తెలీదు. ఒక వేళ మన చావు గురించి మనకు ముందుగానే తెలిస్తే.. దానంత నరకం ఇంకోటి ఉండదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ముందుగానే చనిపోతామని తెలిసిన రోగులు, ఉరి శిక్ష పడ్డ ఖైదీలు తీవ్రమైన మానసిక సంఘర్షణనకు గురవుతూ ఉంటారు. చావు దగ్గర పడే కొద్ది వారిలో ఒకలాంటి బాధ, భయం కలుగుతూ ఉంటాయి.

కొంతమంది ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ, అతికొద్ది మంది మాత్రమే చావును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. బతికే కొన్ని రోజులు ఎవ్వరినీ ఇబ్బందిపెట్టకుండా.. చావు తర్వాత కూడా నా అనుకునే వాళ్లకు మంచి జరగాలని కోరుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో డాక్టర్‌ హర్షవర్థన్‌ ప్రవర్తించిన తీరు సినిమాను తలపిస్తోంది. తాను చనిపోతానని తెలిసినా అతడు ఏ మాత్రం అధైర్యపడలేదు. తన విషయం తెలిసి బాధపడుతున్న తన వాళ్లకు ధైర్యం చెప్పాడు. చివరి క్షణాల వరకు అదే నిబ్బరంతో ఉన్నాడు. చావును కూడా నిద్రలా ఆహ్వానించాడు.

పెళ్లైన 8 నెలలకే ఉప్పెన లాంటి విషాదం..

ఖమ్మం జిల్లాకు చెందిన ఏపూరి హర్షవర్థన్‌ వృత్తి రీత్యా వైద్యుడు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో వైద్య సేవలు అందిస్తున్నాడు. అతడికి వైరా దగ్గరలోని మేనత్తగారి ఊరికి చెందిన సింధు అనే యువతితో ఫిబ్రవరి 12, 2020లో పెళ్లయింది. పెళ్ల తర్వాత ఫిబ్రవరి 29న హర్షవర్థన్‌ ఒక్కడే ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఏప్రిల్‌ మొదటి వారంలో భార్యను తన వద్దకు తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేశాడు. ఈ నేపథ్యంలోనే మార్చి 23 2020లో లాక్‌డౌన్ పడింది. దేశాలకు మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయాయి.

Join Our Whatsapp Channel

దీంతో సింధు ఆస్ట్రేలియా వెళ్లలేకపోయింది. హర్షకి పరిశుభ్రత అంటే ప్రాణం. స్వయంగా వంట చేసుకుని తినేవాడు. బాడీ ఫిట్ నెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు. ప్రతిరోజు జిమ్‌ చేసేవాడు. అక్టోబర్ 2020లో జిమ్‌లో ఎక్సర్‌సైజులు చేస్తుంటే ఆయాసంతో పాటు కొంచెం దగ్గు కూడా రావడం మొదలైంది. వైద్య పరీక్షలు చేయించుకోగా ఉప్పెన లాంటి విషయం ఒకటి తెలిసింది. హర్షకు లంగ్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది.

శోక సంద్రంలో కుటుంబ సభ్యులు.. అగమ్య గోచరంగా సింధు జీవితం

హర్షకు లంగ్‌ క్యాన్సర్‌ అన్న సంగతి కుటుంబసభ్యులకు అతడి భార్యకు తెలిసింది. దీంతో వారు విలవిల్లాడిపోయారు. దాదాపు మూడు నెలల పాటు కన్నీరుమున్నీరుగా విలపించారు. పరుగున హర్ష వద్దకు వెళదామని అనుకున్నారు. కానీ, లాక్‌డౌన్‌ కారణంగా వీళ్లు అక్కడికి వెళ్లలేరు.. అక్కడినుంచి హర్ష ఇండియాకు రాలేడు. నిత్యం నరకం అనుభవించసాగారు. తాను చనిపోతానని అతడికి ముందే తెలిసినా.. కుటుంబసభ్యులకు మాత్రం ఈ విషయం చెప్పలేదు.

ఏం కాదని, రోగం నయం అవుతుందని చెబుతూ వచ్చాడు. కానీ, భార్య సింధును ఓదార్చటం అతడి వల్ల కాలేదు. తాను చనిపోతే సింధు పరిస్థితి దారుణంగా తయారవుతుందని భావించాడు. విడాకులు ఇవ్వమని కోరాడు. అయితే, విడాకులు ఇవ్వటానికి సింధు అంగీకరించలేదు. లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే ఆస్ట్రేలియాకు వచ్చి సేవలు చేస్తానని అంది. అతడు ఇందుకు ఒప్పుకోలేదు. భార్య భవిష్యత్తు గురించి ఆలోచించాడు. పెద్దలను ఒప్పించి విడాకులు తీసుకున్నాడు. భరణంగా పెద్ద మొత్తం ఇచ్చాడు.

చివరి సారిగా సొంత గడ్డకు..

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అతడి తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వస్తామని అతడికి చాలా సార్లు చెప్పారు. ఇందుకు అతడు ఒప్పుకోలేదు. వ్యాధి కారణంగా తాను పడే కష్టాలు వారు చూసి తట్టుకోలేరని అతడు భావించాడు. మెల్ల మెల్లగా వారిని తన చావుకు సిద్ధం చేస్తూ వచ్చాడు. 2022 అక్టోబర్‌ నెలలో ఇండియాకు వచ్చాడు. ఖమ్మంలోని తన తల్లిదండ్రులు కుటుంసభ్యులను కలిశాడు. 15 రోజులు ఇంటి దగ్గరే ఉండి.. ఒకేరోజు తన తల్లిదండ్రులను అమెరికాలోని తన తమ్ముడి దగ్గరకు పంపాడు. తనకు ఆస్ట్రేలియాలోనే మెరుగైన వైద్యం లభిస్తుంది అని చెప్పి తను ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియాలో 100 మందికి పైగా అనాధలు ఉన్న ఆశ్రమంలో వైద్య సేవలు అందించాడు.

చివరి రోజుల్లో కూడా అదే నిబ్బరంతో..

మార్చి 27, 2023కు ముందుగానే హర్ష చనిపోబోతున్నట్లు వైద్యులు ఓ డెత్‌ డేట్‌ను ఇచ్చారు. దీంతో హర్ష తన అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏ‍ర్పాట్లను ముందుగానే చేసుకున్నాడు. చివరి క్షణాలు రానే వచ్చాయి. మార్చి 24వ తేదీన ఉదయం బ్రౌన్ కలర్ జాకెట్.. తెల్లటి పాయింట్.. తెల్లటి షూ ధరించి చక్కగా తయారయ్యాడు. తన స్నేహితులతో కలిసి చాలాసేపు తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడాడు. కొన్ని గంటల తర్వాత మూత్ర విసర్జన కోసం వాష్ రూమ్‌కు వెళ్ళగా మూత్రం బదులు రక్తం రావడం మొదలైంది. ఇదే విషయాన్ని స్నేహితులకు చెప్పాడు.

‘‘ నేను మరొక గంట కంటే ఎక్కువ సేపు మీ ముందు ఉండలేను’’ అని అన్నాడు. రెస్ట్ తీసుకుంటా అని పడుకున్నాడు. సరిగ్గా రెండు నిమిషాల తర్వాత 32 సంవత్సరాల హర్షవర్ధన్ నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. చనిపోతూ ఓ గొప్ప జీవిత సత్యాన్ని లోకానికి చెప్పిపోయాడు. జీవితం చాలా చిన్నది.. సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి. వాటి గురించి బాధపడి ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం మూర్ఖత్వం. చావు తథ్యం అని తెలిసినా.. చివరి వరకు నిబ్బరంగా పోరాడిన హర్ష నిజంగా ఓ గొప్ప వ్యక్తి. ఆయన చనిపోయినా అందరి మనసుల్లో బతికే ఉంటాడు.

Tags :

  • Harshvardhan
  • khammam
  • viral news
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన ఉద్యోగిని.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన గాయత్రి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • గుండెపోటుతో 9వ తరగతి విద్యార్ధి మృతి

    గుండెపోటుతో 9వ తరగతి విద్యార్ధి మృతి

  • ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

    ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

  • రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

    రైలు చక్రాలకు, పట్టాలకు కలిపి తాళం వేసిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam