గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దం అని ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఇక మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ముంబయి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. భవిష్యత్తు జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేసేందుకు వీరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇది చదవండి: రెండేళ్లుగా ఆ ఇంట్లో కంపు వాసన.. తలుపు తీసి చూస్తే.. షాకింగ్ సీన్
సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్న ప్రకాశ్‌రాజ్‌కు టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అందుకు కోసం ప్రత్యేక బృందాన్ని రూపొందిస్తున్నారు. అందులో ముఖ్యంగా నటుడు ప్రకాష్ రాజ్ కు సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉద్ధవ్ ఠాక్రేను కలిసేందుకు ముంబయి వెళ్లిన సమయంలోనూ కేసీఆర్ వెంట ఉండి ప్రకాష్ రాజ్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే రాజ్యసభ సభ్యుడు బండి ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో ఆ సీటు ఖాళీ అయింది. జూన్‌లో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ పదవీ కాలం ముగియనుంది. ఈ మూడు ఖాళీలకు ఒకేసారి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి.
ఇది చదవండి: వీడియో: ఆ ప్రియురాలికి కోపం వచ్చింది! ఊర కొట్టుడు!
ఈ ఖాళీల్లో ఒక సీటును ప్రకాశ్ రాజ్‌కు కేటాయించి, టీఆర్ఎస్ తరఫున ఢిల్లీ రాజకీయాల్లో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం నడుస్తున్నది. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే బాధ్యతలు కూడా ప్రకాశ్‌రాజ్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయం మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడ ప్రస్తావించలేదు అధికార పార్టీ.. భవిష్యత్ లో ఏం జరుగుతుందో చూడాలి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
