సీఎం కేసీఆర్ మనవడు.. మంత్రి కెటిఆర్, శైలిమ దంపతులు తనయుడు హిమన్షురావు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. అంతేకాదు.. కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ (సీఏఎస్) విభాగంలో అతని ప్రతిభను మెచ్చి సీఏఎస్ విభాగంలో ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నాడు.
మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు 12వ తరగతి పూర్తి చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి 12వ తరగతిని పూర్తి చేసిన హిమన్షు, నేడు జరిగిన ‘గ్రాడ్యుయేషన్ డే’ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆ పట్టాను స్వీకరించాడు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు సహా సీఎం కేసీఆర్ దంపతులుసైతం హాజరయ్యారు. ఈ సంధర్భంగా కేసీఆర్.. మనుమడిని ‘ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని ఆశీర్వదించారు’.
‘గ్రాడ్యుయేషన్ డే’ సందర్భంగా 12వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఓక్రిడ్జ్ స్కూలు యాజమాన్యం ఆ పట్టాలను అందజేసింది. విద్యనభ్యసిస్తూనే క్రీడలు, సాంస్కృతిక రంగం, సామాజిక సేవ తదితర రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థినీవిద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేసింది. ఇందులో భాగంగా కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ (సీఏఎస్) విభాగంలో అతని ప్రతిభను మెచ్చి సీఏఎస్ విభాగంలో ఎక్సలెన్స్ అవార్డును అందజేశారు. అయితే గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న హిమాన్షు నేరుగా తన తాత వద్దకు వచ్చి ఆయన చేతుల్లో పెట్టి, పాదాలకు నమస్కరించారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సంధర్భంగా సీఎం కేసీఆర్.. ‘తన కళ్ళముందే చిన్న చిన్న అడుగులు వేసిన తన మనవడు నేడు పెరిగి పెద్దై.. పట్టభద్రుడిగా ఎదిగిన తీరు చూసి సంతోషంలో మునిగిపోయారు. హృదయపూర్వకంగా మనవడిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు. మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు తమ కుమారుడు సాధించిన ప్రతిభానైపుణ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ‘తండ్రికి తగ్గ తనయుడు..’ అంటూ హిమాన్షుపై నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కేటీఆర్ తనయుడైనా.. ఆ దర్పం హిమాన్షురావులో ఎన్నడూ కనిపించలేదన్నది వాస్తవం. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని, 12వ తరగతి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న తమ మనుమడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అభినందించి, ఆశీర్వదించారు.@TheRealHimanshu pic.twitter.com/d4z47sbwhU
— Namasthe Telangana (@ntdailyonline) April 18, 2023